17 న రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు
న్యూస్‌తెలుగు/విజయనగరం : న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ తైక్వాండో అసోసియేషన్ విజయనగరం సంఘం నిర్వహణలో ఈ నెల 17, 18 వ తేదీల్లో విజయనగరం రాజీవ్ ఇండోర్ స్టేడియం నందు రాష్ట్ర స్థాయి జూనియర్ ,సీనియర్ అంతర జిల్లా ల తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు గురాన అయ్యలు , కార్యదర్శి సీహెచ్ వేణు గోపాల రావులు తెలిపారు. 17 వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్రం లోని 13 జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇందులో బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని తెలిపారు.