డా.బి.ఆర్.అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 78వ గణతంత్ర ఉత్సవాలు
డా. వై.రాజ్ కుమార్
న్యూస్‌తెలుగు/చంద్రాయనగుట్ట : బండ్లగూడలోని డా.బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్ ఆర్ యు సి సి సభ్యులు డా.వై.రాజ్ కుమార్ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం యువదేశమని, యువత మత్తుపదార్థాలకు మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. నేటి యువతను క్రమశిక్షణ నేర్పడం తల్లిదండ్రుల కనీస బాధ్యత అన్నారు. అనంతరం బంగ్లాదేశ్ హింసకాండలో ప్రాణాలు కోల్పోయిన హిందువుల పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి సంఘం సభ్యులు ప్రభాకర్, బాలకృష్ణ, రవికుమార్, సునీల్ కుమార్, భాస్కర్, గోవర్ధన్, వంశీ, విజయలక్ష్మి,పుష్ప, దీప్శిక, పార్వతమ్మ, సోమన్షు మరియు తదితరులు పాల్గొన్నారు. (Story : డా.బి.ఆర్.అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 78వ గణతంత్ర ఉత్సవాలు)