సత్య డిగ్రీ,పీజీ కళాశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
న్యూస్‌తెలుగు/విజయనగరం: తోట పాలెం లో గల సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బుధవారం ఎన్ సి సి విభాగం ఆధ్వర్యంలో హర్ ఘడ్ తిరంగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు మొట్టమొదటిగా జాతీయ జెండాను కళాశాలలో కట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండా ను తమ ఇండ్ల పై కట్టుకోవాలి అనే అవగాహన కల్పిస్తూ జాతీయ జెండాను ఎలా కట్టాలి, జెండా యొక్క విశిష్టత ప్రజలు తెలుసుకొని దేశ భక్తి భావన పెంపొందించుకుని ప్రతి ఒక్క పౌరుడు చాల భాధ్యత గా దేశ అభివృద్ధి పట్ల ఉండాలన్నారు.
ఎన్ సి సి కెడేట్స్ భారత్ మాతా కు జై అని నినాదం చేసుకుంటూ పట్టణం లో సుమారు 200 ఇళ్లకు, షాపు లకు జాతీయ జెండాను కట్టారు. ఈ కార్య్రక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, ఎన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ ఎం సత్య వేణి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సత్య డిగ్రీ,పీజీ కళాశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం)