దేశ భక్తిని చాటేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు
ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెప రెపలాడాలి
ప్రతి మండల కేంద్రంలో, ఇంజనీరింగ్ కళాశాలల్లో సేల్ఫీ పాయింట్లు
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం : ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా ప్రతి పౌరుడు తన ఇంటి పైన మువ్వన్నెల జెండా ను ఎగుర వేయాలని కోరారు . బుధవారం కలెక్టర్ తన చాంబర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల పై సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు పలు సూచనలు జరీ చేసారు. అన్ని పాఠశాలల్లో పిల్లలతో ప్రతిజ్ఞ చేయించి జాతీయ జెండాలను చేత పట్టి రాలీలు నిర్వహించాలని , వాటి ఫోటోలను తీసి హర్ ఘర్ తిరంగా వెబ్సైటు నందు అప్లోడ్ చేయాలనీ జిల్లా విద్యా శాఖాధికారి కి సూచించారు. పంచాయతి రాజ్ శాఖ ఆధ్వర్యం లో ప్రతి పంచాయతి లో జాతీయ సమైక్యత పై పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఈ పోటీల కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మైనర్ పంచాయతి కి 10 వేలు చొప్పున, మేజర్ పంచాయతి కి 25 వేలు చొప్పున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలతో కూడా పెద్ద ఎత్తున జెండాలను చేత పట్టి గ్రామాల్లో రాలీలను నిర్వహించాలని డి.ఆర్.డి.ఏ పి.డి. కల్యాణ చక్రవర్తి కి సూచించారు. మండల ప్రధాన కేంద్రాల్లో, అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో సేల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు సేల్ఫీ దిగి ఫోటో ను వెబ్సైటు నందు అప్లోడ్ చేయాలనీ మండల అధికారులకు, కళాశాలల యాజమాన్యాలకు తెలిపారు. అదే విధంగా మున్సిపాలిటీలలో, బస్సు స్టాండ్లలో, రైల్వే స్టేషన్ వద్ద ప్రాముఖ్యత ఉన్న కూడళ్ళ లో సేల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయాలనీ, ఫోటో లు దిగి అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. స్వాతంత్ర్య సమర యోధుల కుటుంభ సభ్యులను, మాజీ సైనికులను ఉదయం పోలీస్ బారెక్ష్ నందు మంత్రి గారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించడం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం జరిగే అట్ హోం కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రముఖులను ఆహ్వానించి దేశ భక్తి గీతాల తో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎటు చూసిన దేశ భక్తిని పెంపొందించే కార్యక్రమాలు జరగాలని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని అధికారులకు తెలిపారు.
ఈ సమావేశం లో డి.ఆర్.ఓ ఎస్.డి.అనిత డి.పి.ఓ శ్రీధర్ రాజా, డి.ఆర్.డి.ఏ పి.డి కల్యాణ చక్రవర్తి, జిల్లా పర్యాటక అధికారి లక్ష్మినారాయణ, విజయనగరం మున్సిపల్ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు , జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టన్ సత్య ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. (Story : దేశ భక్తిని చాటేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు)