సత్య డిగ్రీ కళాశాల లో మాదక ద్రవ్య దుర్వినియోగం పై అవగాహన ర్యాలీ
న్యూస్‌తెలుగు/విజయనగరం : స్థానిక తోట పాలెం లో గల సత్య డిగ్రీ& పీజీ కళాశాలలో సోమవారం కళాశాల ఎన్ సి సి విభాగం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావుమాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాల జోలికి పోకూడదని, అటువంటివి ఒక వేళ ఉపయోగిస్తే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా ఎంతో నష్టం జరుగుతుందన్నారు. కావున విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్నిగడపాలన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన కేసలి అప్పారావు , ఆంధ్ర ప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాల వుచ్చు లో పడకూడదన్నారు. జీవితం లో పెట్టుకున్న లక్ష్యం వైపు మీ ధ్యాస ఉండాలన్నారు. ప్రస్తుతం మాదకద్రవ్యాలు అనేవి పెద్ద వ్యాపారం నడుస్తున్నదని, మీకు ఎవరైనా ప్రలోభ పెట్టిన వీటికి దూరంగా వుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని, ఈ మాదక ద్రవ్యాలను తీసుకుంటే మనిషి విచక్షణ కోల్పోతాడని అందువలన విద్యార్థులు వీటి జోలికి పోకుండా చదువు పైన శ్రద్ధ పెట్టీ ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. అనంతరంవిద్యార్థులందరూ మాదక ద్రవ్యాల జోలికి పోము అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, ఎన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ సత్య వేణి, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి సూరపు నాయుడు, ఎన్ సి సి కాడెట్స్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సత్య డిగ్రీ కళాశాల లో మాదక ద్రవ్య దుర్వినియోగం పై అవగాహన ర్యాలీ)