Home వార్తలు అప్సర ఐస్‌క్రీమ్స్‌ ఆధ్వర్యంలో ముస్కాన్‌ కార్యక్రమం

అప్సర ఐస్‌క్రీమ్స్‌ ఆధ్వర్యంలో ముస్కాన్‌ కార్యక్రమం

0

అప్సర ఐస్‌క్రీమ్స్‌ ఆధ్వర్యంలో ముస్కాన్‌ కార్యక్రమం

న్యూస్‌తెలుగు/ముంబై: ప్రజల ముఖాల్లో ఆనందం, చిరునవ్వులు నింపే ప్రయత్నంలో భాగంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవంతో మిళితమయ్యేలా 53వ వార్షికోత్సవం సందర్భంగా ముస్కాన్‌ పేరుతో ఒక విశిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా అప్సర ఐస్‌క్రీమ్స్‌ ప్రకటించింది. ఐదు దశాబ్దాలకు పైగా మార్కెట్‌లో ఉనికిని కలిగిన విశ్వసనీయ బ్రాండ్‌ అయిన అప్సర ఐస్‌ క్రీమ్స్‌, ప్రారంభం నుండి కూడా తన వినియోగదారులకు నాణ్యమైన ప్రీమియం ఐస్‌ క్రీమ్‌లను అందిస్తోంది. తన 53వ వార్షికోత్సవంలో భాగంగా భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వేడుక చేసుకోవడానికి అప్సర ఐస్‌క్రీమ్స్‌ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇది నిజంగా భారతీయులందరికీ గర్వకారణం. ఈ కార్యక్రమం ఆగస్టు 15న ముంబై, పుణేలలో ప్రారంభమవుతుంది. ఆ తరువాత దశలవారీగా ఇతర నగరాల్లో అమలు కానుంది. ముస్కాన్‌ కార్యక్రమం కింద కంపెనీ 53,000 ఐస్‌క్రీమ్‌లు (దాదాపు నాలుగు టన్నుల ఐస్‌క్రీమ్‌) పంపిణీ చేయాలని భావిస్తోంది. ఈ కార్యక్రమం భారతదేశంలోని 9 రాష్ట్రాలు, 25 నగరాలలో అమలు కానుంది. (Story :అప్సర ఐస్‌క్రీమ్స్‌ ఆధ్వర్యంలో ముస్కాన్‌ కార్యక్రమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version