7.58% వృద్ధి సాధించిన ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: భారతదేశంలో 50 రకాల రిఫ్రిజిరేషన్ పరికరాల ప్రముఖ తయారీదారు, ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్, జూన్ 30, 2024న ముగిసిన ఆర్థిక సంవత్సరం 2025 మొదటి త్రైమాసికానికి తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.79.31 కోట్లతో పోలిస్తే, కంపెనీ ఏకీకృత ఆదాయ వృద్ధి 7.58%తో రూ.85.33 కోట్లకు చేరుకుంది. అయితే, వ్యూహాత్మక రిక్రూట్‌మెంట్‌లు, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగిన కారణంగా, క్యూ1 ఎఫ్‌వై25కి ఏకీకృత నికర లాభం 32% క్షీణించి రూ. 3.64 కోట్లకు చేరింది, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 5.36 కోట్లగా వుంది. ఈ త్రైమాసికంలో, ఐస్ మేక్ గత సంవత్సరం ఇదే కాలంలో ఎబిట్డా రూ. 8.34 కోట్లతో పోలిస్తే రూ. 6.13 కోట్ల ఎబిట్డా ను నమోదు చేసింది, ఎబిట్డా మార్జిన్ 7.19% కాగా ప్రతి షేరుకు వార్షికేతర ఆదాయాలు రూ. 2.35గా ఉంది. (Story : 7.58% వృద్ధి సాధించిన ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్)