అడల్ట్ వ్యాక్సినేషన్‌పై ఫైజర్, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ (బేగంపేట్) భాగస్వామ్యం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: హైదరాబాద్‌లోని కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ (బేగంపేట్)లో వయోజన వ్యాక్సి నేషన్ కు సంబంధించి కొత్త, ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఆవిష్కరించడానికి ఫైజర్ ఇండియా, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ చేతులు కలిపాయి. వయోజన వ్యాక్సినేషన్ వంటి ముందుజాగ్రత్త నివారణ ఆరోగ్య చర్యలను ప్రోత్సహించడం ద్వారా సహా కమ్యూనిటీ సభ్యులు ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను సులభంగా యాక్సెస్ చేయగలరని నిర్ధారించే దృష్టితో సీఓఈ స్థాపించబడిరది. అనేక రకాల ఉత్పాదనలతో, న్యుమోకాకల్ వ్యాధి, ఇన్‌ఫ్లుఎంజా, హ్యూమన్ పాపిల్లోమా వైరస్, హెపటైటిస్ ఏ, బీ వంటి వివిధ టీకాతో నివారించగల వ్యాధుల నుండి రక్షణ పొందేలా ఈ కేంద్రం ప్రజలను ప్రోత్సహిస్తుంది. కిమ్స్ – సన్‌షైన్ హాస్పిటల్ (బేగంపేట్) సీఓఓ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ టీకాతో నివారించగల వ్యాధుల నుండి ప్రజలను రక్షించడానికి వయోజన ఇమ్యునైజేషన్ ఒక ముఖ్య పరిష్కారాన్ని సూచిస్తుందన్నారు. (Story : అడల్ట్ వ్యాక్సినేషన్‌పై ఫైజర్, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ (బేగంపేట్) భాగస్వామ్యం)