మీషో స్మార్ట్ షాపర్ రిపోర్ట్ తొలి ఎడిషన్ విడుదల
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్ మీషో తన స్మార్ట్ షాపర్ రిపోర్ట్ మొదటి ఎడిషన్‌ను విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్ 1 2024లో దేశంలోని డైనమిక్ ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్‌ల సమగ్ర విశ్లేషణను అందిస్తోందన్నారు. ఈ నివేదిక మారుతున్న అలవాట్లను అన్వేషిస్తుందనీ, మాస్ కస్టమర్ల అభిరుచులు, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే జనాభాలో 80 శాతం మంది ఉన్నారన్నారు. మీషో కొత్త-ఇ-కామర్స్ వినియోగదారులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. వినియోగదారుల షాపింగ్ అలవాట్లను నిర్వచించే ట్రెండ్‌లపై వెలుగునిస్తుందన్నారు. ఈ మీషో వినియోగదారుల ఎంపికల ప్రస్తుత డైనమిక్‌లను హైలైట్ చేయడమే కాకుండా సామూహిక వినియోగ విధానాలకు నమ్మకమైన సూచికగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. (Story : మీషో స్మార్ట్ షాపర్ రిపోర్ట్ తొలి ఎడిషన్ విడుదల)