“సంతాన ప్రాప్తిరస్తు” నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా : విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్ తరుణ్ తో “అహ నా పెళ్లంట” అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆయన రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ యాడ్ ను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా తెరకెక్కుతోంది.
ఈ రోజు యంగ్ హీరో విక్రాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు హెల్దీ డైట్, మెడిసిన్స్, వ్యాయామం, యోగా, స్ట్రెస్ తగ్గించుకోవడం, బుక్స్ తో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం..ఇలా వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్న హీరో స్టిల్ తో డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.
నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి తదితరులు