UA-35385725-1 UA-35385725-1

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో ముంద‌డుగు!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో ముంద‌డుగు!

క‌ర్నాట‌క అట‌వీ అధికారుల‌తో కీల‌క స‌మావేశం
రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌స్య‌ల‌కు చెక్‌
వివిధ అంశాల‌పై నిర్ణ‌యాల‌తో భేటీ విజ‌య‌వంతం

న్యూస్ తెలుగు/బెంగ‌ళూరు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారంనాడు బెంగళూరులో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రేతో స‌మావేశ‌మై, అట‌వీ సంబంధిత అంశాల‌పై సుదీర్ఘ చ‌ర్చ జ‌రిపారు. అనంత‌రం కర్ణాటక అటవీ అధికారులతో సమావేశమ‌య్యారు. ఈ స‌మావేశం తర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఖండ్రే త‌దిత‌రులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ముఖ్యమైన అంశాలు

* కర్ణాటక – ఆంధ్ర ప్రదేశ్ మధ్య ఎల్లప్పుడూ సుహృద్భావ వాతావరణం ఉంటుంది. రెండు రాష్ట్రాల అధికారులు పాలకులు కూడా కలిసి పని చేస్తే చాలా సమస్యలు తీరుతాయి.
* కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు వైపు ఏనుగుల సమస్య అధికంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు తగిన విధంగా సహకారం అందించడం సంతోషం కలిగించింది.
* ముఖ్యంగా 8 కుంకి ఏనుగులను ఆంధ్ర ప్రదేశ్ కు అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం మంచి పరిణామం.
* ఈ రోజు సమావేశంలో ఏడు అంశాలపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తుండగా కర్ణాటక ప్రభుత్వం పట్టుకుంది. రూ. 140 కోట్ల వరకు అక్రమ రవాణా ఎర్రచందనాన్ని కర్ణాటక అటవీ సిబ్బంది పట్టుకున్నారు. ఎర్ర చందనంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
అటవీ సంపద రక్షణ కోసం సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపైనా సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఉపగ్రహ ఆధారిత నిఘాపెట్టి పూర్తిస్థాయి సేవలు వినియోగించుకునే అవకాశాలను భవిష్యత్తులో తీసుకువస్తాం.
* వన్యప్రాణులను చంపి స్మగ్లింగ్ చేసే వారిని కట్టడి చేసేలా రెండు రాష్ట్రాలు సమష్టిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. వన్యప్రాణులను ఇష్టానుసారం వేటాడి స్మగ్లింగ్ చేసే వారిపై కఠినంగా ఉంటాం.
* తిరుమల, శ్రీశైలం దేవస్థానాలకు కర్ణాటక నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. వీరికి అవసరమైన యాత్రి సదన్ నిర్మాణాల నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం రెండు చోట్ల తగిన విధంగా భూములు కేటాయించాలని కోరింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు దృష్టికి అలాగే క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్తాము.
* ఎకో టూరిజం అభివృద్ధి విషయంలో కూడా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఒక పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించాయి.
* ముఖ్యంగా సమావేశంలో జరిగిన ఏడు అంశాల చర్చ చేశాము. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎం.ఓ.యూ. చేసుకున్నాయి. దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు రెండు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు తగిన విధంగా పనిచేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటారు.
ఈ విధంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ర్నాట‌క అధికారులు, మంత్రితో జ‌రిపిన స‌మావేశం ప‌లు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టింది. ఇరు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న అనేక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఈ స‌మావేశం ద్వారా దారి దొరికింది. ఒక ఏపీ మంత్రి తొలిసారిగా చొర‌వ చూపి, పొరుగు రాష్ట్రం అధికారుల‌తో కూర్చొని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కంచుకోవ‌డం ఇదే మొద‌టిసారి. (Story : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో ముంద‌డుగు!)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1