వండర్లాలో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్లు
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ ‘వండర్లా హాలిడేస్’ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం తమ బెంగళూరు, హైదరాబాద్, భువనేశ్వర్, కొచ్చిలోని అన్ని పార్కులలో ఆగస్ట్ 6 నుండి ప్రత్యేక ఫ్రీడమ్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. సందర్శకులకు అసాధారణమైన విలువను అందించాలనే నిబద్దతలో భాగముగా వండర్లా తీసుకువచ్చిన ఈ ఆఫర్ లో భాగంగా సందర్శకులు ఈ క్రింది తగ్గింపును ఆస్వాదించవచ్చు. అతిథులు ఆన్‌లైన్‌లో తమ ప్రవేశ టికెట్స్ ను బుక్ చేసుకున్నప్పుడు ప్రత్యేకమైన ‘2 కొనండి ఒకటి ఉచితంగా పొందండి’ టిక్కెట్ డీల్‌ను పొందవచ్చు. అలాగే, అతిథులు పార్క్ టిక్కెట్ కౌంటర్‌లలో ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్నప్పుడు ప్రత్యేకమైన ‘3 కొనుగోలు చేయండి, 1 ఉచితంగా పొందండి’ టిక్కెట్ డీల్‌ను పొందవచ్చునని వండర్లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలపిల్లి తెలిపారు. (Story : వండర్లాలో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్లు)