ఆగస్ట్ 8 నుంచి ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ షూటింగ్ ప్రారంభం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా: కె.జి.యఫ్‌తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రాక్ స్టార్ యష్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా భారీ బడ్జెట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో నటించనున్నారు. ఆయన, నిర్మాత వెంకట్ కె.నారాయణ, కుటుంబ సభ్యులతో తో కలిసి కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు శ్రీసదాశివ రుద్ర సూర్య ఆలయం, ధర్మస్థలలోని శ్రీ మంజునాథేశ్వర ఆలయం, సుబ్రమణ్యలోని కుక్కే సుబ్రమణ్య ఆలయంను సందర్శించారు.
ఏదైనా కొత్త సినిమాను ప్రారంభించే ముందు ఇలా ఆలయాలను సందర్శించటం యష్‌కున్న అలవాటు అని ఆయన అభిమానులు అంటున్నారు. ఆయనకు ఫ్యాన్స్ నుంచి చక్కటి స్వాగతం లభించింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ బెంగళూరులో ఆగస్ట్ 8 నుంచి ప్రారంభం కానుంది (8-8-8)
ఇలా 8-8-8 అనే నెంబర్ వచ్చే రోజున యష్ తన కొత్త సినిమాను ప్రారంభించటం విశేషం. నెంబర్ 8తో రాకింగ్ స్టార్ యష్‌కు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన పుట్టిన తేదితో ఈ తేది సరిపోతుంది. అలాంటి ఓ తేదీన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. (Story : ఆగస్ట్ 8 నుంచి ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ షూటింగ్ ప్రారంభం)