విద్యార్ది దశయనుంచే సమాజంపై భాద్యత కలిగి ప్రవర్తించాలి
ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
న్యూస్‌తెలుగు/విజయనగరం : ప్రతీ విద్యార్ధి తమ చదువుతో పాటు సమాజం పై స్పృహ కలిగి తమ జీవితాన్ని ఉన్నతంగా మలచుకోవాలని సుప్రసిద్ధ గేయ రచయిత, కవి, గాయకుడు సుద్దాల అశోక్ తేజ పిలుపునిచ్చారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం లో బుధవారం జరిగిన జాతీయ విద్యావిధానం ద్వారా “మంచి ఆలోచనలు – సృజనాత్మకత మరియు మూర్తిమత్వ వికాసం” అనే అంశం పై జరిగిన సదస్సు లో తొలుత విసి ప్రొఫెసర్ కట్టిమని, ముక్య అతిది సుద్దాల అశోక్ తేజ లు జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమమన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ కస్టం వెనకే సుఖం, బాధ తరువాత ఆనందం సహనం తోనే విజయం చేకూరుతాయని, మీరు అత్యంత వెనుకబడిన స్తాయి నుంచి అత్యుత్తమ స్తాయికి ఎదిగినప్పుడే మీ జీవితానికి సార్ధకత అని విద్యార్దులకు తెలిపారు .అనంతరం తన బాణీ పాటలతో విద్యార్దులను ఉర్రూత లూగించారు. అనంతరం విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ తేజస్వి కట్టిమని మాట్లాడుతూ జాతీయ విద్యావిధానం లో చదువుతో పాటుగా ఆటలు, పాటలు, లలిత కళలు, చిత్ర లేఖనం, సాహిత్యం, జాతీయత, సంస్కృతి, సాంప్రదాయాలు మొదలైనవి కూడా ఉండాలని వాటిని కూడా పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ పరిపాలనాధికారి డాక్టర్ ఎన్ వి ఎస్ సూర్యనారాయణ అనుసంధాన కర్తగా వ్యవహరించగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్, ప్రొఫెసర్ శరత్చంద్ర బాబు, ప్రోఫ్. జె ఏం మిశ్రా, డా. పరికిపండ్ల శ్రీదేవి, డా.అనిరుధ్ కుమార్, డా. సురేష్ బాబు డా.దివ్య, డా. ప్రమా, డా. లతా, డాక్టర్ వెంకటేశ్వర్లు తదితర అద్యాపకులు, ఆద్యాపకేతరులు, విద్యార్దులు పాల్గొన్నారు. (Story : విద్యార్ది దశయనుంచే సమాజంపై భాద్యత కలిగి ప్రవర్తించాలి )