సత్తా చాటిన జిల్లా తైక్వాండో క్రీడాకారులు
న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్ : ఈ నెల 3,4 తేదీల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి లో జరిగిన సబ్ జూనియర్ , కాడేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని పతకాలు సాధించారు. అందులో సబ్ జూనియర్ పూమూసే విభాగం లోఓవరాల్ చాంపియన్షిప్ పస్ట్ ప్లేస్ , క్యురోగి సబ్ జూనియర్ విభాగం లో ఓవరాల్ చాంపియన్షిప్ పస్ట్ ప్లేస్ , కేడేట విభాగం లో ఓవరాల్ చాంపియన్షిప్ పస్ట్ ప్లేస్ జిల్లా క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. ఇందులో 14 గోల్డ్ మెడల్స్ , 7 సిల్వర్ మెడల్స్ , 11 బ్రంజ్ మెడల్స్ గెలుపొందారు. వీరికి శిక్షణ ఇచ్చిన కోచ్ లు ఏం . గగన్ సాగర్ దొర , కె . చైతన్య , సి హెచ్ . యశస్వినిలను, గెలుపొందిన క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గురాన అయ్యలు , సి హెచ్ . వేణు గోపాల్ రావు , సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్.ఎస్.ఎ న్. రాజు అభినందించారు…భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. (Story : సత్తా చాటిన జిల్లా తైక్వాండో క్రీడాకారులు )