కల్ట్ బ్లాక్ బస్టర్ “బేబి” సినిమా ప్రూవ్ చేసింది
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా:
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. 8 నామినేషన్స్ లో 5 అవార్డ్స్ గెల్చుకుంది బేబి. ఈ నేపథ్యంలో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో
లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ – నా కెరీర్ లో దక్కిన రెండో ఫిలింఫేర్ అవార్డ్ ఇది. మొదటి అవార్డ్ వచ్చి 12 ఏళ్లవుతోంది. పుష్కరకాలం తర్వాత ఫిలింఫేర్ అవార్డ్ రావడం హ్యాపీగా ఉంది. ఈ వేదిక మీదున్న ఏ ఒక్కరు లేకున్నా నాకు ఈ అవార్డ్ వచ్చేది కాదు. మీ పాట బాగుందంటే లిరిసిస్ట్ ఎక్కడ రెమ్యునరేషన్ పెంచమని అడుగుతాడో అని భయపడే రోజులివి. అలాంటి టైమ్ లో మీ పాట వల్లే బేబి సినిమా ప్రేక్షకుల్లో విస్తృతంగా వెళ్లిందని చెప్పిన మంచి ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. పాటలోని ఒక్క అక్షరాన్ని మార్చమని అడగలేదు మా డైరెక్టర్ గారు. విజయ్ బుల్గానని గారు బ్యూటిఫుల్ ట్యూన్ చేశారు. ఇలా వీరందరి కృషి వల్లే ఓ రెండు మేఘాలిలా పాటకు ఫిలింఫేర్ అవార్డ్ దక్కింది. అన్నారు.
సింగర్ శ్రీరామచంద్ర మాట్లాడుతూ – బేబి సినిమాలో నేను పాడిన ఓ రెండు మేఘాలిలా పాటకు బెస్ట్ సింగర్ గా ఫిలింఫేర్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్ లో దక్కిన మొదటి ఫిలింఫేర్. ఈ పాట పాడే అవకాశం ఇచ్చిన సాయి రాజేశ్ గారికి, ఇతర టీమ్ అందరికీ థ్యాంక్స్. విజయ్ బుల్గానని ఎంతో అందంగా ఈ పాట ట్యూన్ చేశారు. ఇండియన్ ఐడల్ లో నేను గెలిచేలా మీరంతా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ అవార్డ్ అందుకునేందుకు కూడా మీ ప్రోత్సాహం ఉంది. అన్నారు.
సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ – నేనొక మంచి మూవీ చేయాలని..కెరీర్ లో ఒక్కసారైనా ఫిలింఫేర్ అందుకోవాలనే రెండు కోరికలు నాకు ఉండేవి. ఆ రెండూ బేబి సినిమాతో తీరడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సాయి రాజేశ్ గారిని మర్చిపోలేను. ఆయన ఈ పాటలో చిన్న పిల్లల వాయిస్ ఉండాలని సజెస్ట్ చేశారు. ఫిలింఫేర్ ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేయాలని భావిస్తున్నా. అన్నారు.
కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగలినేని మాట్లాడుతూ – బేబి సినిమాతో మా జర్నీ మర్చిపోలేనిది. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్ తో జర్నీ చేస్తున్నాం. బేబి చిత్రానికి 5 ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ దక్కడం సంతోషంగా ఉంది. టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. మా సినిమా నేషనల్ అవార్డ్స్ కూడా అందుకోవాలి. అన్నారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ – ఫిలింఫేర్ లో బేబి సినిమాకు నేను బెస్ట్ యాక్ట్రెస్ గా పురస్కారం అందుకోవడం, మా మూవీకి 5 అవార్డ్స్ దక్కడం సంతోషంగా ఉంది. బేబి సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది. నాకు ఇలాంటి గొప్ప మూవీలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత ఎస్ కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్ గారు, మాకు సపోర్ట్ గా ఉన్న మారుతి గారికి థ్యాంక్స్. మీరు ఇచ్చే ఈ ఎంకరేజ్ మెంట్ తో మరిన్ని మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – మా బేబి సినిమాకు ఫిలింఫేర్ లో 8 నామినేషన్స్ కు 5 అవార్డ్స్ దక్కడం సంతోషంగా ఉంది. అనంత్ శ్రీరామ్ గారికి తప్ప మా అందరికీ ఇది ఫస్ట్ ఫిలింఫేర్. బేబి సినిమాను ఫస్ట్ 2 వీక్స్ మీడియా తన భుజాలపై మోస్తే అక్కడి నుంచి ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్లారు. మా సినిమాకు క్రిటిక్స్ మెచ్చిన బెస్ట్ మూవీ అవార్డ్ దక్కింది. అందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఓ రెండు మేఘాలిలా పాటకు అనంత్ శ్రీరామ్ గారు 3 వెర్షన్స్ రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కు నిరీక్షణ మూవీ రిఫరెన్స్ ఇచ్చా. ఆయన అనేక ట్యూన్స్ ఇచ్చిన తర్వాత ఈ పాట సెలెక్ట్ చేసుకున్నా. ముందు ఈ పాటను బాలు గారితో పాడించాలని అనుకున్నాం. కానీ ఆయన స్వర్గస్తులవడంతో శ్రీరామచంద్రను సెలెక్ట్ చేసుకున్నాం. ఈ పాటను ముందు పిల్లలతో పాడించాం. ఆ తర్వాత శ్రీరామచంద్ర పాడారు. రెండూ బాగున్నాయి. రెండూ కలిపి చేయమని విజయ్ కు చెప్పాను. అలా ఈ పాట వచ్చింది. బేబి సినిమా చేసేప్పుడు మోరల్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు మా మారుతి గారు. నువ్వొక కల్ట్ మూవీ చేస్తున్నావు అని ఎంకరేజ్ చేశారు. వైష్ణవి చైతన్య బాగా పర్ ఫార్మ్ చేసింది. ఆమెకు అవార్డ్ రావడం సంతోషంగా ఉంది. బేబికి వచ్చే క్రెడిట్అంతా నా మిత్రుడు ఎస్ కేఎన్ కే చెందుతుంది. అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – బేబి సినిమాకు 5 ఫిలింఫేర్ అవార్డ్స్ దక్కడం సంతోషంగా ఉంది. అవార్డ్స్ అంటే పెద్ద సినిమాలకే వస్తాయి చిన్న చిత్రాలకు రావు అని నిరాశ పడేవారికి ఉత్సాహాన్నిచ్చేలా బేబి మూవీకి ఇన్ని అవార్డ్స్ దక్కడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు మీడియా మిత్రులు బాగా సపోర్ట్ చేశారు. బేబి సినిమా కథ చెప్పినప్పుడు సాయి రాజేశ్ కమర్షియల్ గా బాగా చేస్తాడని అనుకున్నాం. ఈ సినిమా చూశాక ఒక గొప్ప మూవీ చేశాడనిపించింది. ఈ సినిమా చూశాక అప్పటికి వరకు నాలో ఉన్న ఒత్తిడి పోయింది. సాయి రాజేష్ టాలెంట్ హృదయ కాలేయం కంటే ముందే మాకు తెలుసు. ఆయన దగ్గర బేబి లాంటి మంచి కాన్సెప్ట్స్ ఇంకా ఉన్నాయి. అందుకే ఆయనను ఒక డైమండ్ లా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. సాయి రాజేశ్ లో మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. అది రేపు బేబి హిందీ రీమేక్ తో దేశమంతా తెలియాలని కోరుకుంటున్నా. విజయ్ బుల్గానిన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. వైష్ణవి బాగా నటించింది. మా ఎస్ కేఎన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాడు. సినిమా బాగా వస్తుందని చెబుతుంటాడు. శ్రీరామచంద్ర గారికి, అనంత్ శ్రీరామ్ గారికి, మా ధీరజ్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – అవార్డ్స్ అంటే స్టార్స్ సినిమాలకే వస్తాయనే అపోహను తొలగినపోయిన సందర్భం ఇది. బేబి సినిమాకు 5 ఫిలింఫేర్ అవార్డ్స్ దక్కడం సంతోషంగా ఉంది. ఫిలిం బాగా ఫేర్ చేస్తే చాలు అనుకుంటాం కానీ ఫిలింఫేర్స్ కూడా దక్కడం మర్చిపోలేనిది. బేబి మాకు ఎన్నో మెమొరీస్ ఇస్తూనే ఉంది. రివార్డ్స్ తోపాటు అవార్డ్స్ అందిస్తోంది. గామా దగ్గర నుంచి దేశంలోని పలు అవార్డ్స్ మా సినిమాకు దక్కుతున్నాయి. ఒక మంచి సినిమా చేస్తే తప్పకుండా అన్నీ వస్తాయని చెప్పేందుకు బేబి ఎగ్జాంపుల్. క్రిటిక్స్, బాక్సాఫీస్ సక్సెస్ వేర్వేరుగా ఉంటాయి. కానీ మా మూవీకి ఆ రెండూ కలిశాయి. దర్శకుడు సాయి రాజేశ్ నాకు ఎప్పటినుంచో మంచి మిత్రుడు. ఆయనలో గొప్ప టాలెంట్ ఉంది. చిరంజీవి గారి కెరీర్ లో ఖైదీ ఎలాగో నా కెరీర్ లో బేబి అలా. విజయ్ బుల్గానిన్ డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. ధీరజ్ నాకు తలలో నాలుకలా పనిచేశారు. అరవింద్ గారు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు. ఓవర్ ది నైట్ ఏదీ కాదు. ఆ నైట్ కోసం ఎన్నో రాత్రులు కష్టపడాలి. బేబికి వంద ప్రీమియర్ లు వేశాం. అక్కడి నుంచే బేబి జర్నీ స్టార్ట్ అయ్యింది. బేబి మంచి సినిమా కాబట్టి మీడియా ఒక ఫిల్లర్ లా మోసింది. ఈ సినిమాలో అద్భుతమైన పర్ ఫార్మెన్స్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండకు థ్యాంక్స్ చెబుతున్నా. వైష్ణవికి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. తెలుగు అమ్మాయినే తీసుకోవాలని వైష్ణవి ఈ మూవీకి సెలెక్ట్ చేశాం. మా మారుతి గారికి , అనంత్ శ్రీరామ్ గారికి, శ్రీరామచంద్ర అందరికీ నా థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు. (Story : కల్ట్ బ్లాక్ బస్టర్ “బేబి” సినిమా ప్రూవ్ చేసింది)