5 నుంచి జీ తెలుగులో కలవారి కోడలు కనకమహాలక్ష్మి
న్యూస్‌తెలుగు/ఆదిలాబాద్: జీ తెలుగు అందిస్తున్న సరికొత్త సీరియల్ ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’. నమ్మకద్రోహానికి బలైన ఇద్దరు వ్యక్తుల జీవితమే ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ సీరియల్ ఆకట్టుకునే కుటుంబ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందనీ సంస్థ ప్రతినిదులు తెలిపారు. తండ్రీకూతుళ్ల బంధం, భార్యాభర్తల అనుబంధం మధ్య ఉద్వేగభరితంగా సాగే సరికొత్త సీరియల్ ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ ఆగస్టు 5న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే అన్నారు. కూతురు భవిష్యత్తు కోసం ఆరాటపడే తండ్రి, ఆయన సంతోషం కోసం పాటుపడే కూతురు, తండ్రి కోరికను గౌరవించడం తప్ప మరో కల లేని కనకమహాలక్ష్మి కథే ఈ సీరియల్ అన్నారు. అనూహ్యంగా జరిగే వివాహంతో ఇద్దరి జీవితాలు ముడిపడతాయన్నారు. ప్రేమ, పెళ్లి, విధి నడుమ సాగే కథ ఉత్కంఠరేపే మలుపులతో ఆకట్టుకుంటుందన్నారు. (Story : 5 నుంచి జీ తెలుగులో కలవారి కోడలు కనకమహాలక్ష్మి )