Home వార్తలు  #G2 నుంచి ఆరు స్టన్నింగ్ మూమెంట్స్ ని రివిల్ చేసిన హీరో అడివి శేష్

 #G2 నుంచి ఆరు స్టన్నింగ్ మూమెంట్స్ ని రివిల్ చేసిన హీరో అడివి శేష్

0

 #G2 నుంచి ఆరు స్టన్నింగ్ మూమెంట్స్ ని రివిల్ చేసిన హీరో అడివి శేష్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: హీరో అడివి శేష్ తన సెన్సేషనల్ స్పై థ్రిల్లర్ గూఢచారి 6వ యానివర్సరీ సందర్భంగా ఫ్యాన్స్ కోసం ట్విట్టర్ లో థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్స్ చేశారు. స్టన్నింగ్ మూమెంట్స్ తో ఫ్యాన్స్ ని థ్రిల్ చేశారు.

గూఢచారి కి సీక్వెల్ గా రూపొందుతున్న G2 ఫ్రాంచైజీని న్యూ హైట్స్ కు ఎలివేట్ చేస్తోంది. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి కావడంతో, మేకర్స్ సినిమాని ఇంటర్నేషనల్ స్కేల్ లో ప్రజెంట్ చేస్తూ ఆరు స్టైలిష్ యాక్షన్ మూమెంట్‌లను రిలీజ్ చేశారు. G2లోని ఈ మూమెంట్స్ ఇండియాలోనే కాకుండా గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేకంగా నిలిచే స్పై థ్రిల్లర్‌ను ప్రజెంట్ చేస్తున్నాయి.

2025 సెకండ్ హాఫ్ లో గ్రాండ్‌గా విడుదల కానున్న G2 అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది వైడ్ రేంజ్ లో  ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించారు. శేష్‌తో కలిసి రైటర్ గా కూడా ఉన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.

ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ.. “గూఢచారి సినిమా చాలా ప్రత్యేకమైనది. గత 6 సంవత్సరాలుగా ఈ సినిమా గురించి ప్రశంసలు వింటూనే వున్నాను. G2 బిగ్గర్ అండ్ ఇంటర్ నేషనల్ స్కేల్ లో వుంటుంది. గూఢచారి అభిమానులందరికీ G2 ఒక మ్యాసీవ్ విజువల్ ట్రీట్ అవుతుంది’ అన్నారు.

దర్శకుడు సిరిగినీడి మాట్లాడుతూ, “ప్రస్తుతం 40% షూటింగ్ పూర్తి చేశాం.  సినిమా అద్భుతమైన క్యాలిటీతో వస్తోంది. సినిమా రూపుదిద్దుకుంటున తీరుపై చాలా నమ్మకంగా, ఉత్సాహంగా వున్నాం. విజువల్ వండర్ క్రియేట్ చేయడంపై దృష్టి పెట్టాం. థ్రిల్లింగ్ సెట్ పీస్ లు,  డైనమిక్ యాక్షన్ సీక్వెన్స్‌ లు ఇలా ప్రతి ఎలిమెంట్ ప్రేక్షకులను గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది. యాక్షన్ డ్రామా జానర్‌లోని అభిమానులందరికీ ఈ చిత్రం గొప్ప అనుభూతిని ఇస్తుంది’ అన్నారు.

నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ, ” పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒక మైల్ స్టోన్ గా నిలిచిన “గూఢచారి” చిత్రం 6వ యానివర్సరీ జరుపుకుంటున్నాము. “G2” 40% షూటింగ్‌ అద్భుతంగా పూర్తి చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ సీక్వెల్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమే కాకుండా అంచనాలకు మించి వుంటుంది. మొత్తం బడ్జెట్‌కు ఎంత ఖర్చవుతుందో అంత ఖర్చుతో కూడిన యాక్షన్ సీక్వెన్స్ ని ఇటీవలే చిత్రీకరించాము.  కొత్త బెంచ్‌మార్స్, అభిమానులు, ప్రేక్షకులకు క్యాలిటీ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంపై దృష్టి పెట్టాం, అడివి శేష్  పెర్ఫార్మెన్స్, మా టీం డెడికేషన్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఆకట్టుకుంటుంది. ఇది మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్ అడ్వెంచర్’ అన్నారు

నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, “మా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో జి2 ఒకటి. ఇంటర్ నేషనల్ స్కేల్ ప్రొడక్షన్ తీసుకురావడానికి శేష్, వినయ్, టీం చాలా కష్టపడుతున్నారు. సినిమా గ్రాండియర్ గా వుంటుంది. ఇటివలే ఒక యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేశాం. ఈ  ఒక్క సీక్వెన్స్ బడ్జెట్ మొత్తం గూఢచారి బడ్జెట్ కంటే ఎక్కువ’ అన్నారు

G2 టీం అథెంటిక్, బ్రెత్ టేకింగ్ స్పై థ్రిల్లర్‌ను అందించడానికి రెడీ అవుతోంది. ఇది గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులని ఆకట్టుకునే చిత్రాన్ని రూపొందించడమే లక్ష్యంగా టీం పని చేస్తోంది.

నటీనటులు : అడివి శేష్, ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధుశాలిని (Story :  #G2 నుంచి ఆరు స్టన్నింగ్ మూమెంట్స్ ని రివిల్ చేసిన హీరో అడివి శేష్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version