Home వార్తలు ‘అలనాటి రామచంద్రుడు’ కు వస్తున్న రెస్పాన్స్  ఆనందాన్ని ఇచ్చింది

‘అలనాటి రామచంద్రుడు’ కు వస్తున్న రెస్పాన్స్  ఆనందాన్ని ఇచ్చింది

0

‘అలనాటి రామచంద్రుడు’ కు వస్తున్న రెస్పాన్స్  ఆనందాన్ని ఇచ్చింది

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : 
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటించిన లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్  బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు. టాప్ ప్రొడక్షన్& డిస్ట్రిబ్యుషన్ సంస్థ SVC ( శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) ఆగస్ట్ 2న గ్రాండ్ గా విడుదల ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.

థాంక్స్ మీట్ లో హీరో కృష్ణ వంశీ మాట్లాడుతూ.. ప్రేక్షక దేవుళ్ళు అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలిసింది. ఇప్పటివరకూ ప్రేక్షకుడిగానే సినిమాలు చూశాను. ఇప్పుడు మా సినిమాకి ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమ, ఆదరణ చూస్తుంటే మాటలు రావడం లేదు. ప్రేక్షక దేవుళ్ళు అందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు. మా నిర్మాతలు హైమావతి, శ్రీరామ్ జడపోలు, విక్రమ్, జగదీశ్ గారికి ధన్యవాదాలు. ఒక డెబ్యుటెంట్ కి ఇంత గొప్ప అవకాశం రావడం నా అదృష్టం. వారికి జీవితాంతం రుణపడి వుంటాను. సిద్దు పాత్ర నేను చేయగలనని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆకాష్ రెడ్డి గారికి చాలా థాంక్స్. ఈ సినిమా నా కెరీర్ లో మంచి మెమరీగా నిలిచిపోతుంది. మోక్ష అద్భతంగా నటించింది. తను బెస్ట్ కోస్టార్. కంపోజర్ శశాంక్ గారు సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆడియన్స్ విజువల్స్ చాలా బ్యూటీఫుల్ గా వున్నాయిని చెబుతున్నారు. ఇంత మంచి విజువల్స్ ఇచ్చిన డీవోపీ ప్రేమ్ గారికి థాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సందర్భంగా మా గురువుగారు సత్యనంద్ గారికి కృతజ్ఞతలు. ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళుకు మరోసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు’ తెలిజేశారు.

హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఇందులో నేను చేసిన ధరణి పాత్ర నా మనసుకి చాలా దగ్గరైనది. చాలా ఒరిజినల్ క్యారెక్టర్. ఇంత అద్భుతమైన కంటెంట్ తీసిన దర్శక నిర్మాతలు ధన్యవాదాలు. డైరెక్టర్ ఆకాష్ గారు చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. ఇది మనందరీ కథ. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా అద్భుతంగా వుంది. అందరూ చాలా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రేక్షకుల సపోర్ట్ కి థాంక్ యూ సో మచ్’ అన్నారు.

డైరెక్టర్ చిలుకూరి ఆకాష్ రెడ్డి మాట్లాడుతూ.. మా సినిమాకి చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు చాలా థాంక్స్. వాళ్ళు లేకపొతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు. నా డైరెక్షన్ టీం చాలా కష్టపడ్డారు. శశాంక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇంత మంచి విజువల్స్ ఇచ్చిన ప్రేమ్ కి థాంక్ యూ. మా సినిమాని సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ థాంక్ యు సో మచ్’ అన్నారు.

సంగీత దర్శకుడు శశాంక్ టి మాట్లాడుతూ.. సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మమ్మల్ని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు చాలా థాంక్స్. సినిమా చూసిన ఆడియన్స్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. మ్యూజిక్ ఇంత బాగా రావడానికి కారణం ఆకాష్ సినిమా తీసిన విధానం. టీమ్ అందరికీ థాంక్ యూ సో మచ్’ అన్నారు.

కో- ప్రొడ్యూసర్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అలనాటి రామచంద్రుడు’ మ్యూజికల్ హిట్. ఈ హిట్ కోసం మా డైరెక్టర్ చాలా కష్టపడ్డారు. శశాంక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కు చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు’ తెలిపారు.

ప్రొడ్యూసర్ శ్రీరామ్ జడపోలు మాట్లాడుతూ.. అందరికీ ధన్యవాదాలు. సినిమాకి చాలా మంచి పాజిటివ్ టాక్ రావడం చాలా ఆనందంగా వుంది. అందరూ కొత్తవాళ్ళం కలసి చేసిన ప్రయత్నం ఇది. అన్ని సెంటర్స్ లో చాలా మంచి రెస్పాన్స్ వుంది. ఏ సెంటర్స్ లో మార్నింగ్ షోకి ఈవినింగ్ షోకి కలెక్షన్స్ పెరిగాయి. ఈ సినిమా ఖచ్చితంగా పిక్ అప్ అవుతుంది. సినిమా బెస్ట్ మ్యూజిక్ తో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తోంది. శశాంక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయని ప్రతి రివ్యూలో చూశాను.  అలనాటి రామచంద్రుడు విలువల కోసం నిలబడ్డాడు. తన ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడ్డారు. కష్టం పడిన ప్రతీసారి ఎందరో సాయపడ్డారు. నా ప్రయాణంలో కూడా ప్రతి అడుగులో సాయపడిన వ్యక్తులు వున్నారు. ఈ సినిమాని ఇంత సక్సెస్ ఫుల్ గా చేయడానికి కారణం విక్రమ్. తనే మా వెంట నిలబడి నడిపించారు. ఆయనకి మనస్పూర్తిగా ధన్యవాదాలు. ఇంత సపోర్ట్ చేసిన అందరికీ థాంక్ యూ.’ అన్నారు. ఈ ఈవెంట్ లో సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు. (Story : ‘అలనాటి రామచంద్రుడు’ కు వస్తున్న రెస్పాన్స్  ఆనందాన్ని ఇచ్చింది)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version