తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసిన ఎమ్మెల్సీ దండే విఠల్
న్యూస్‌తెలుగు/కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి సిర్పూర్ నియోజక వర్గం లోని పలు సమస్యలు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పి మాజీ చైర్మన్ సిడెం గణపతి,సిర్పూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు టిపిసిసి మెంబర్ అర్షద్ హుస్సేన్,మాజీ ఎంపిపి డుబ్బుల నాన్నయ్య,బసర్కార్ విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు. (Story : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసిన ఎమ్మెల్సీ దండే విఠల్)