రక్తదాతలకు అభినందన సత్కారం
న్యూస్‌తెలుగు/విజయనగరం : స్థానిక గాయత్రి హాస్పిటల్ లో కంచర్ల వారి నగరపాలక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పొట్టా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిచే స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ టి.ఆనందబాబు పాల్గొని రక్తదాతలను అభినందించారు.
ఒక పాఠశాల ఉపాధ్యాయుడు సామాజిక బాధ్యతగా రక్తదానం యొక్క ఆవశ్యకత తెలుసుకొని వేసవికాలంలో సుమారు 320 యూనిట్లు పైగా రక్తదాతలును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు అందించి ప్రాణదాతగా నిలిచిన పొట్టా.శ్రీనివాసరావు, టి.ఆనంద్ బాబు సన్మానించడం జరిగింది. ప్రతి ఒక్క ఉపాధ్యాయులు శ్రీనివాసరావు ను ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాయత్రి హాస్పిటల్ ఎండి డాక్టర్ జి.బి వెంకట్, రెడ్ క్రాస్ ప్రతినిధి ఎం. రాము పి.టి.సి ఆర్.ఐ డి శంకర్రావు నగరపాలక సంస్థ పాఠశాల ఉపాధ్యాయులు సవితాన సంతోష్ కుమార్, రెడ్ క్రాస్ వైద్య సిబ్బంది, రెడ్ క్రాస్ వాలంటీర్ పి.సుధాకర్ పాల్గొన్నారు అనంతరం 46మంది రక్తదానం చేశారు. (Story : రక్తదాతలకు అభినందన సత్కారం)