ఫిలిఫ్ఫైన్స్లలో హీరోమోటోకార్ప్ ఆపరేషన్స్ ప్రారంభం
న్యూస్‌తెలుగు/ముంబయి: మోటారుసైకిళ్లు, స్కూటర్ల తయారీలో అతిపెద్ద కంపెనీ అయిన హీరో మోటోకార్ప్ ప్రపంచవ్యాప్తంగా తన విస్తరణ క్రమాన్ని మరింత పెంచింది. తాజాగా ఫిలిప్ఫైన్స్లో ఆపరేషన్స్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా కంపెనీకి ఇదొక కీలక మైలురాయిగా పరిగణించవచ్చు. ఈ మేరకు ఫిలిఫ్ఫైన్స్లోని అనుభవం గల ఆటోమోటివ్ గ్రూపుల్లో ఒకటైన కొలంబియన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో భాగమైన టెర్రాఫర్మా మోటార్స్ కార్పొరేషన్ (టీఎంసీ)తో ఒప్పందం కుదిరింది. ఈ రెండు కంపెనీల మధ్య భాగస్వామ్యం 2022 అక్టోబరులోనే మొదలైంది. ఇకనుంచి హీరో మోటో కార్ప్ ఉత్పత్తులు, సేవలను టీఎంసీ పంపిణీ చేస్తుంది. ఆపరేషన్స్ ప్రారంభమవుతున్నాయని, ఇది తమ అంతర్జాతీయ ఉనికిని మరింత బలోపేతం చేస్తుందని హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. (Story : ఫిలిఫ్ఫైన్స్లలో హీరోమోటోకార్ప్ ఆపరేషన్స్ ప్రారంభం)