తమ్మిలేరు కాజ్వే అభివృద్ధికి 100% కృషి చేస్తా
చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్
న్యూస్‌తెలుగు/ చాట్రాయి : తమ్మిలేరు కాజ్వే వద్ద ప్రమాదాలు నివారించడానికి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయడానికి సరిహద్దులలో రవాణా సౌకర్యం మెరుగవడానికి తన వంతుగా 100% కృషి చేస్తానని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ తెలిపారు. ఇటీవల భారీ వర్షాల వలన తెలంగాణా ప్రాంతం నుండి ఉదృతంగా వస్తున్న వరద ప్రభావం వలన చాట్రాయి మండలం చిన్నంపేట చింతలపూడి మండలం శివపురం గ్రామాల మధ్య తమ్మిలేరుపై నిర్మించిన కాజ్వే వద్ద ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొని ఉండటం వలన గురువారం సాయంత్రం శివపురం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రోషన్ ప్రమాదకరంగా మారిన కాజ్వే వద్దకు వచ్చి పరి స్థితులను పరిశీలించారు. తెలుగు రైతు ఏలూరు జిల్లా అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వరరావు సమస్య యొక్క తీవ్రతను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. సరిహద్దు ప్రాంతాలలో రవాణా సౌకర్యం మెరుగుపరచడానికి నూజివీడు శాసనసభ్యులు జిల్లా మంత్రి అయిన సారధి తో మాట్లాడి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయడానికి తన వంతుగా 100% కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా,ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. (Story : తమ్మిలేరు కాజ్వే అభివృద్ధికి 100% కృషి చేస్తా)