ఆన్ సైట్ గో ఉపకరణాల బ్రాండ్ జ్యూస్ ఆవిష్కరణ
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: భారతదేశ నెం.1 పరికరాల సంరక్షణ నిపుణ సంస్థ అయిన ఆన్ సైట్ గో తన పరికరాల అనుబంధ ఉపకరణాల బ్రాండ్ జ్యూస్‌ను దేశవ్యాప్తంగా ఆవిష్కరించింది. స్టైలిష్ పవర్ బ్యాంక్‌లు, కేస్ కవర్ల నుండి ఫంక్షనల్ అడాప్టర్‌ల వరకు, జ్యూస్ బై ఆన్ సైట్ గో మొబైల్ యాక్సె సరీస్ మార్కెట్‌లో చక్కదనం, పనితీరు, సుస్థిరత్వం కోసం ప్రమాణాలను పునర్నిర్వచించేలా రూపుదిద్దుకున్నాయి. జ్యూస్ అనేది మరొక అనుబంధ బ్రాండ్ మాత్రమే కాదు, ఇది సమయానుకూలమైన ఛార్జ్, తిరుగులేని కనెక్షన్, స్టైలిష్ అప్‌గ్రేడ్ శక్తిని అర్థం చేసుకునే టెక్ ఔత్సాహికులు, సాహసికులు, క్రియేటర్ల కమ్యూనిటీ అవసరాలను కచ్చితంగా తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. జ్యూస్ శ్రేణి ఉత్పత్తులు ఫ్యాషన్‌తో ఉంటాయి. సజావుగా మీ జీవనశైలిలో కలిసిపోతాయి. జ్యూస్ యాక్సెసరీలు అత్యధిక నాణ్యత ప్రమాణాలతో రూపొందించబడ్డాయి. ప్రీమియం మెటీరియల్‌ని ఉపయోగిస్తాయి. (Story : ఆన్ సైట్ గో ఉపకరణాల బ్రాండ్ జ్యూస్ ఆవిష్కరణ)