సాహిత్యం సమాజహితాన్ని కోరుకుంటుంది
మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి: సాహిత్యం సమాజ హితాన్ని సామాజిక ప్రయోజనాన్ని కోరుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం వనపర్తి పట్టణం లోని యాదవ సంఘ భవనంలో ప్రముఖ కవి రచయిత నాగవరం బాల్ రాం రచించిన రిఫ్లెక్షన్స్ పుస్తకావిష్కరణ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పుస్తకావిష్కరణ చేసి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం ఒక దేశ సంస్కృతిని ప్రతిబింబింపజేయడమే గాక మానసిక వికాసం, పరిణితిని కలిగిస్తుందని వివరించారు. నాగవరం బాల్ రాం గత యాభై ఏళ్లు తమ సాహిత్య జీవితంలో మనిషికి సమాజానికి సంబంధించిన అనేక అంశాలను వివిధ కోణాలలో విశ్లేషించి కవితలు రాశారని అన్నారు.సమాజంలో వివాదాలు, వివక్షలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా మనిషి ఎదగాలనేది ఆయన ఆకాంక్షగ నిరంజన్ రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలోనూ సాహిత్య జీవితంలోనూ నాగవరం బాల్ రాం అజాత శత్రువుగా ముందుకు సాగుతున్నారని కొనియాడారు.రిఫ్లెక్షన్స్ కవితలు నేటి తరం చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అందుకుకు ఆ పుస్తకాలు జిల్లాలోని ప్రతి పాఠశాలకు అందజేసెలా తాను ఆర్థిక సాయం అందజేస్తానని అన్నారు. నిర్వాహకులు కవి, రచయిత బాల్ రాం ను శాలువా పూలమాల జ్ఞాపికలతో సన్మానించారు.అతిథులుగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య ప్రముఖ వైద్యులు డా భూపెష్ కుమార్, సుజాతమ్మ కిరణ్ కుమార్, సత్తార్, చిన్న రాములు, కౌన్సిలర్స్ వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమల్ల, అశోక్ నాగన్న, గులాం ఖాదర్, సాహితీ వేత్తలు కోట్ల వెంకటేశ్వర రెడ్డి, వనపట్ల సుబ్బయ్య, డా.వీరయ్య, బైరోజు చంద్ర శేఖర్, నారాయణ రెడ్డి, బండారు శ్రీనివాసులు, వహీద్ ఖాన్, మద్దిలెటి తదితరులు పాల్గొన్నారు. (Story: సాహిత్యం సమాజహితాన్ని కోరుకుంటుంది)