Home వార్తలు  ఏ జర్నీ టు కాశీ చిత్రం ప్రైమ్ లో విడుదల

 ఏ జర్నీ టు కాశీ చిత్రం ప్రైమ్ లో విడుదల

0

 ఏ జర్నీ టు కాశీ చిత్రం ప్రైమ్ లో విడుదల

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: వారణాసి క్రియేషన్స్ పతాకంపై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికొవ్, ప్రియా పాల్వాయి, కతాలీన్ గౌడముఖ్య తారాగణం తో మునికృష్ణ దర్శకత్వం లో కె.పి. లోకనాథ్, దొరడ్ల బాలాజీ మరియు శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం  ‘ఏ జర్నీ టు కాశీ’ అమెజాన్ ప్రైమ్  రెంటల్ లో జూలై 20 నుంచి ప్రసారం అవుతుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం చిత్రానికి సహకరించిన అందరికీ  కృతజ్ఞతలు తెలిపింది. 2024, జనవరి 6న థియేటర్లలో విడుదల అయ్యి జాతీయ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో తొమ్మిది అవార్డులు పొంది మన్ననలు  పొందింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతూ ప్రేక్షకులు, వెబ్ విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.

ప్రముఖ రచయిత నాటక ప్రయోక్త సౌదా అరుణ ఈ చిత్రాన్ని సమీక్షిస్తూ “అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు అపరిచితులు కాశిలో కలుసుకొని ఒకరినొకరు గుర్తు పడతారు. వొకరు వేశ్య! ఇంకొకరు సన్యాసుల లో కలిసిన ఆమె తండ్రి! ఇది ఒక వేశ్య ఆధ్యాత్మిక ప్రయాణం!! ఇది ఒక  తండ్రి స్పిరిచువల్ ప్రోస్టిట్యూషన్!! .ఒకప్పుడు భారతదేశాన్ని చెర పట్టిన పాపం నుంచి ఈ తరంలో ప్రాయశ్చితం చేసుకోడానికి ఈ వేశ్య ఆశీర్వాదం కోసం ప్రయత్నించే వొక బ్రిటిష్ జాతి లవరబోయ్!! అతడి దృష్టిలో ఆమె మదర్ ఇండియా! ఈ సినిమాలో పాత్రలు ఇవీ! ” అని   కథాంశాన్ని వివరించారు.

ది లాస్ట్ బ్రాహ్మిన్ రచయిత రాణి శివశంకర శర్మ చిత్రాన్ని చూసి దర్శకుడు మునికృష్ణ సత్యాన్ని దర్శనం చేసే శక్తి గల దర్శకుడు. మనం కూడా జర్నీ చేద్దాం నిజం కాశీకి” అని అన్నారు.
(Story :  ఏ జర్నీ టు కాశీ చిత్రం ప్రైమ్ లో విడుదల)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version