Home వార్తలు యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ టీజర్

యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ టీజర్

0

యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ టీజర్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా :
మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్నారు పవన్ కుమార్ కొత్తూరి. ఇక ఇప్పుడు ఆయన దర్శకుడిగా, హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పవన్ కుమార్ తన రెండో సినిమా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’తో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది.
ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. మోస్ట్ రొమాంటిక్‌గా సాగిన ఈ టీజర్‌ యూత్‌ ఆడియెన్స్‌ను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.
‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి’,, ‘కాలేజ్‌లో ఉన్నంత వరకే స్టూడెంట్ నాని.. ఆ తరువాత కూకట్ పల్లి నాని’ అంటూ సాగే డైలాగ్స్‌తో యావరేజ్ స్టూడెంట్ నాని మోస్ట్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా సాగింది. ఈ టీజర్‌లో యూత్‌కి కావాల్సిన ప్రతీ అంశం ఉంది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని యాంగిల్స్‌ను టచ్ చేస్తూ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఈ టీజర్‌లో విజువల్స్, ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ సినిమాకి ఎడిటర్.
నటీనటులు: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, తదితరులు (Story : యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ టీజర్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version