Home వార్తలు బంధన్‌ బ్యాంకు ఆర్థిక ఫలితాలు విడుదల

బంధన్‌ బ్యాంకు ఆర్థిక ఫలితాలు విడుదల

0

బంధన్‌ బ్యాంకు ఆర్థిక ఫలితాలు విడుదల

న్యూస్‌తెలుగు/ముంబయి: 2024`25 ఆర్థిక సంవత్సరానికిగాను బంధన్‌ బ్యాంక్‌ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడిరచింది. క్యూ1 ముగిసే సమయానికి బంధన్‌ బ్యాంక్‌ 2.59 లక్షల కోట్ల రూపాయల వ్యాపారంతో 22% వ్యాపార వృద్ధిని సాధించింది. మొత్తం డిపాజిట్లలో బ్యాంకు వాటా దాదాపు 69% ఉంది. గత త్రైమాసికానికితో పోల్చితే ఈ బ్యాంకు వ్యాపార సమర్థతను సాధించింది. కాసా (కరెంట్‌ అకౌంట్‌ మరియు సేవింగ్స్‌ అకౌంట్‌) రేషియోను 33.4%కి, రిటైల్‌ షేర్‌ను 69%కి, ఇయర్‌ టు ఇయర్‌ చూస్తే మొత్తం రుణనమోదు రేటును 22%కి పెంచి, రూ.1.26 లక్షల కోట్ల వద్ద నిలిచింది. దేశంలోని 6,300 బ్యాంకింగ్‌ అవుట్‌లెట్ల ద్వారా 3.44 కోట్లకుపైగా కస్టమర్లకు బ్యాంకు సేవలు అందజేస్తున్నది. ఈ బ్యాంకులో ఉద్యోగుల సంఖ్య 77,500కి పెరిగింది. (Story : బంధన్‌ బ్యాంకు ఆర్థిక ఫలితాలు విడుదల)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version