Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ టీటీడీ ఆధ్వర్యంలో వేద పారాయణం

టీటీడీ ఆధ్వర్యంలో వేద పారాయణం

0

టీటీడీ ఆధ్వర్యంలో వేద పారాయణం

న్యూస్‌తెలుగు/ విజయనగరం : తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠము, విజయనగరములో సామవేద కౌథుమ శాఖ సంహితా హవనము నిర్వహించారు. మహోపాధ్యాయ రిటైర్డ్ టిటిడివేదపారాయణ గణేషన్ శ్రౌతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో వేద విద్యార్ధులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కు ప్రిన్సిపాల్ కే. వి.ఎన్. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ లోక కళ్యాణార్ధం వేద విద్యా వ్యాప్తి కోసం ఈ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో చేపట్టామన్నారు. అదే విధంగా ఈ నెల 26 న భారీ వేద సభ నిర్వహిస్తున్నామన్నారు. వివిధ పాఠశాలల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వివిధ పుణ్య క్షేత్రాల నుంచి ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది వేద పండితులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని వెల్ల డించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేశస్ధానం వేద పండితులు సుందర రామ శ్రేతి, శ్రీకౄష్ణ శ్రేతి,రాజేష్,పంచాపకేశన్, వేద పండితులు క్రిష్ణప్రసాద్, తేజ,పవన్ కుమార్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. (Story : టీటీడీ ఆధ్వర్యంలో వేద పారాయణం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version