UA-35385725-1 UA-35385725-1

‘రాయన్’  అందరికీ నచ్చుతుంది

‘రాయన్’  అందరికీ నచ్చుతుంది

తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో ధనుష్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా  :  నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ యాక్టర్ గా తన 50 మైల్ స్టోన్ మూవీ ‘రాయన్’కి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో ధనుష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఐ యామ్ వెరీ లక్కీ. నా కెరీర్ లో చాలా మంచి ఫిలిం మేకర్స్ తో కలసి పని చేసే అవకాశం దొరికింది. సెల్వ రాఘవన్, సుబ్రహ్మణ్యం శివ, భూపతి పాండియన్, వెట్రిమారన్.. ఇలా నాతో సినిమాలు చేసిన దర్శకులందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా కెరీర్‌లో నేను నా తప్పుల నుంచే ఎక్కువ నేర్చుకున్నా. అందుకే మనం చేసే మిస్టేక్స్ కి థాంక్ ఫుల్ గా వుండాలి. డైరెక్షన్ చాలా భాద్యతతో కూడుకున్నది. నాకు నటనపైన ఎంత ఇష్టం ఉందో దర్శకత్వంపైనా అంతే ఇష్టముంది. నేను డైరెక్టర్ చేసిన రాయన్ 26న వస్తోంది. ఇదొక బ్లెసింగ్ గా భావిస్తున్నాను. నిర్మాత కళానిధి మారన్ గారికి, ఎఆర్ రెహ్మాన్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, ఎస్జే సూర్య, సందీప్, అపర్ణ, నా టెక్నికల్ టీం అందరికీ పేరుపేరునా థాంక్ యూ. నన్ను ఎంతగానో అభిమానించే తెలుగు ఆడియన్స్ కి ధన్యవాదాలు. నా నుంచి కోరుకునే మంచి డైలాగ్స్, యాక్షన్, సాంగ్స్ అన్నీ రాయన్ లో ఉన్నాయి. ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను. రాయన్ నా యాభైవ సినిమా. చాలా మంచి సినిమా. జూలై 26న రిలీజ్ అవుతుంది. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..ముందుగా ఊరు పేరు భైరవకోన సినిమాని పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. 14 ఏళ్ళుగా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ధనుష్ అన్న రాయన్ సినిమాలో నన్ను యాక్ట్ చేయమని అడిగినప్పుడే అదొక అవార్డ్ లానే ఫీల్ అయ్యా. ధనుష్ అన్న నాకు ఒక బ్రదర్ అండ్ గురువు లాంటి వారు. ధనుష్ అన్న తన యాభైవ సినిమాలో తనకోసం రాసుకున్న క్యారెక్టర్ లో నన్ను యాక్ట్ చేయమని ఆయన డైరెక్ట్ చేశారు. ఇంతకంటే నాకు గొప్ప అవార్డ్ వుండదు. ఈ సినిమా చూసి ఒక తెలుగు హీరో తమిళ్ లో ఇంత మంచి క్యారెక్టర్ చేయగలిగాడని ఆడియన్స్ అంతా చాలా గర్వంగా ఫీలౌతారు. కెప్టన్ మిల్లర్ ఫినిష్ అయ్యాక రాయన్ షూట్ కి వెళ్లాం. ఈ షూటింగ్ మరచిపోని అనుభూతిని ఇచ్చింది. చాలా కష్టమైన క్యారెక్టర్‌ అని ధనుష్‌ ముందే చెప్పారు. నా హెయిర్‌ స్టైల్‌ కూడా ఆయనే సెట్‌ చేశారు. ఆయన ఓ సీన్‌ను సింగిల్‌ టేక్‌లో పూర్తి చేశారు. కానీ నేను 11 సెకన్ల లెంత్ వున్న సీన్ కి 16 టేక్స్‌ తీసుకున్నా. తర్వాత, మిగిలిన వారంతా రీ టేక్స్‌ తీసుకోవడంతో నా భయం పోయింది.( నవ్వుతూ) నన్ను తన పక్కన కూర్చుని ధనుష్ అన్న కొత్త విషయాలు నేర్పించారు. జీవితంలో ఇలాంటి అవకాశం మరోసారి రాదేమో. న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీకి వెళ్లినా ఇలాంటి యాక్టింగ్‌ కోర్స్‌ నేర్చుకోలేం. ఒక నటుడికి ఇది చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశం ఇచ్చిన ధనుష్ అన్నకి థాంక్ యూ. ప్రకాష్ రాజ్ గారితో కలసి నటించడం కూడా గొప్ప అనుభూతి. రెహ్మాన్ గారు నాకో పాటిచ్చారు. సన్ పిక్చర్స్ కి థాంక్స్. టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రాయన్ అద్భుతమైన సినిమా. ధనుష్ గారు యాక్టర్ గా నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ గెలవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది’ అన్నారు.

యాక్టర్ ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రాయన్ ధనుష్ 50వ సినిమా. సందీప్ కిషన్, కాళిదాస్, అపర్ణ, తుషారా..ఈ యంగ్ స్టార్స్ కళ్ళలో ఆకలి చూస్తున్నాను. ఇలాంటి వెరైటీ యాక్టర్స్ సినిమాలో వుండటం చాలా ఆనందంగా వుంది. ధనుష్ ఒక నటుడిగా వాళ్ళ ఆకలిని తీర్చడానికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి. ముఫ్ఫై 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో వున్నా. 30 ఏళ్ళు వుండటం పెద్ద విషయం కాదు.  కళాకారుడు తన ప్రతిభ వల్లే పెద్దవాడు కాలేడు, ప్రేక్షకులు ప్రేమ, నమ్మకం వలన అవుతాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అన్నయ్య చిరంజీవి గారు, రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ వచ్చన్, మణిరత్నం గారు ఇలా నమ్మకాన్ని నిలబెట్టుకున్నవారే. ధనుష్ తన ప్రస్థానంలో ఎన్నో పాత్రలు చేస్తూ తన పని వల్ల తను అందమవ్వడం, గొప్ప వ్యతిత్వాన్ని చూపడం చూస్తున్నాం. ధనుష్ కి దర్శకుడిగా చాలా స్పష్టత వుంది. ఈ సినిమాని డైరెక్టర్ చేస్తూ, ఇళయరాజా గారి బయోపిక్ కి రెడీ అవుతూ, శేఖర్ కమ్ముల గారితో సినిమా చేస్తూ.. నన్ను నిత్యామీనన్ ని పెట్టి తన దర్శకత్వంలో ఓ కథ చెప్పాడు. ఇలాంటి  కృషిని చూస్తున్నపుడు ఇది కదా సినిమాకి కావాల్సిందనిపిస్తుంది. తను జనరేషన్స్ కి స్ఫూర్తి. రాయన్ 26న వస్తోంది. మరో కొత్త అనుభవం. ధనుష్ ఇంకో విశ్వరూపం. ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ప్రకాష్ రాజ్ అన్నయ్య ఒక గురువు ఉంటూ నన్ను, మా బ్యానర్ ని నడిపిస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. ధనుష్ ఇండియన్ సినిమాలో ఫైనెస్ట్ హీరో, ఆర్టిస్ట్. ప్రతి సినిమాలో కొత్తదనం ప్రయత్నిస్తూ.. రైటర్స్ డైరెక్టర్ యాక్టర్ గా వస్తున్న రాయన్ లుక్స్ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ ధనుష్ అండ్ టీం. బిగ్ స్టార్ కాస్ట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ సక్సెస్ సాధించి తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎక్స్ ట్రార్డినరీ రెవెన్యు రావాలని కోరుకుంటున్నాను. సునీల్, సురేష్ బాబు గారికి ఆల్ ది బెస్ట్’ తెలిపారు

ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ధనుష్, ప్రకాష్ రాజ్, అపర్ణ, కాళిదాసు ఇలా నేషనల్ అవార్డ్ విన్నర్స్ ట్యాలెంట్ ని ఒక్క చోట చూడటం చాలా ఆనందంగా వుంది. ధనుష్ బ్రదర్ నేను మంచి ఫ్రెండ్స్. తనని యంగ్ ఏజ్ నుంచి చూస్తున్నాను. ఈ సినిమా డిస్ట్రిబ్యుషన్ చూస్తున్నామని ఓ పాట విన్నాను. అక్కడ లిరిక్స్ ధనుష్ అని రాసుంది.  తనది అవుట్ స్టాండింగ్ టాలెంట్. తను బౌండరీలని పుష్ చేస్తూ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకులుతున్నాడు. రాయన్ పెద్ద విజయం సాధించాలని టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు,

డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ..ధనుష్ గారి ప్రతి సినిమా రిలీజ్ రోజే చూస్తాను. ఆయన ఏ క్యారెక్టర్ లోనైనా ఒదిగిపోతారు.  రాయన్ లుక్ చూసి స్టన్ అయ్యాను. ఇది ధనుష్ గారికి మరో నేషనల్ అవార్డ్ తీసుకొచ్చే సినిమా అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దమ్ము ఈ సినిమాలో వుంది. ఈ సినిమాలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. రెహ్మాన్ గారి మ్యూజిక్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. ఈ సినిమాని తెలుగు రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారు ఏసియన్ సునీల్ గారికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ధనుష్ గారు మల్టిట్యాలంటెడ్. ధనుష్ గారి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాని చూడటానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నా’ అన్నారు.

హీరోయిన్ అపర్ణ బాలమురళి మాట్లాడుతూ.. మీ అందరికీ అభిమానానికి థాంక్ యూ. రాయన్ వెరీవెరీ స్పెషల్ మూవీ. ధనుష్ గారికి పెద్ద ఫ్యాన్స్ ని . ఆయన డైరెక్షన్ లో నటించడం, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. రాయన్ బ్యూటీఫుల్ జర్నీ. ధనుష్ గారు రాయన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమా తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది’ అన్నారు.

హీరోయిన్ తుషారా విజయన్ మాట్లాడుతూ.. రాయన్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నేను ధనుష్ గారికి పెద్ద ఫ్యాన్ ని, ఆయన డైరెక్ట్ చేసిన ఫిల్మ్ లో ఆయనతో కలసి నటించడం ఆనందంగా వుంది. అపర్ణ, కాళి, ప్రకాష్ రాజ్ సర్, ఎస్ జే సూర్య గారు లాంటి అద్భుతమైన నటులతో నటించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సన్ పిక్చర్స్ కి, ఏసియన్ సినిమాస్ కి థాంక్ యూ.’ అన్నారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. (Story : ‘రాయన్’  అందరికీ నచ్చుతుంది)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1