వైభవంగా నల్ల పోచమ్మ, మహంకాళి ఆలయ ఘటం ఊరేగింపు
న్యూస్‌తెలుగు/ /హైదరాబాద్: శ్రీ శ్రీ నల్ల పోచమ్మ మహంకాళి దేవాలయం 102వ వార్షిక బోనాల మహోత్సవంలో భాగంగా మంగళవారం బ్రోచర్ ఆవిష్కరణ, ఘటాల ఊరేగింపు ప్రారంభం జరిగింది. సబ్జిమండిలోని నల్ల పోచమ్మ, మహంకాళి ఆలయ ఘటం ఊరేగింపు వైభవంగా జరిగింది. టప్పా చబుత్ర, లోధ్ క్షత్రియ నగర్ మలైమెట్ నటరాజ్ నగర్, కుమ్మరవాడి తదితర వీధుల గుండా సాగిన ఘటం ఊరేగింపునకు అన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్యాట నందకిషోర్, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కుడుముల రాకేష్ కోశాధికారి కట్టా శ్రీనివాస్, సలహాదారులు కట్ట రాజయ్య, సేనాపతి చంద్రశేఖర్, గూడబోయిన శివరత్నం, జలగరి వేణు, కట్ట శివరాజ్, బుర్ర వేణు కుమార్, కట్ట నర్సింగ్ రావు, అవుశెట్టి. ఎన్. శ్యామ్ సుందర్, గుడుమని అశోక్ కుమార్, గాండ్ల నిరంజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.(Story : వైభవంగా నల్ల పోచమ్మ, మహంకాళి ఆలయ ఘటం ఊరేగింపు)