అధికారుల నిర్లక్ష్యం వల్లే పెద్ద వాగు ప్రాజెక్టుకు గండి
– నష్టపోయిన రైతులను, నిర్వాసితులను ఆదుకోవాలి
– ప్రభుత్వం వెంటనే మరమ్మత్తులకు నిధులు కేటాయించాలి
– నమగ్రవిచారణ జరిపించాలి.
– సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
న్యూస్‌తెలుగు/ భద్రాచలం : అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అశ్వరావుపేట మండల పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని, దీనిపై ప్రభుత్వం నమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా కార్య దర్శి సాబీర్ పాషా డిమాండ్ చేశారు. మంగళవారం గండిపడిన పెద్దవాగు ప్రాజెక్టు ప్రాంతాన్ని సిపిఐ ప్రతినిధి బృంధం పరిశీలించింది. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ ఏళ్లు తరబడి 16500 ఎకాల ఆయకట్టుకు సాగునీరు అందించే పెద్దవాగు ప్రాజెక్టు అప్పట్లో 1650 ఎకరాల్లో ఎంతో నాణ్యతతో నిర్మించారని చెప్పారు. చిన్నాచితకా వర్షాలకు వరదకు కొట్టుకుపోదని, ప్రాజెక్టు ఉన్న మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన నిర్వహణాధికారులు నిర్లక్ష్యం దోరణి ప్రదర్శించడం ద్వారానే ప్రాజెక్టు గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది ఎకరాల్లో ఇనుక మేటలు వేశాయని, వేలాది ఎకరాల్లో వంట పొలాలు దెబ్బతిన్నాయని, కమ్మరిగూడెం తదితర గ్రామాల్లో అనేక మంది నిర్వాసితులు అయ్యారని చెప్పారు. పశువులు కొట్టుకుపోయాయని, పశువుల కాపరులు భయంతో చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు, రైతు కూలీలు పంట పొలాల్లో చిక్కుకోవడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ రక్షణ చర్యలు చేపట్టి హెలీకాప్టర్ల సహాయంతో రక్షించారని చెప్పారు. పెద్దఎత్తున ఆస్తి, పశు నంపదకు నష్టం వాటిల్లినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. వర్షాకాలం సీజన్ రెండు మాసాలు ఉందని, ఐనప్పటికీ ప్రాజెక్టు మర్మమ్మత్తులకు నిధులు కేటాయించి రైతులు రెండో పంట చేనుకునేందుకు ప్రభుత్వం సహకరించాలన్నారు. రాష్ట్ర విభజన మూలంగా ప్రాజెక్టు తెలంగాణలో ఉందని, దాని ఆయ కట్టు సుమారు 3 వేల ఎకరాల వరకు ఏపిలో ఉందని చెప్పారు. అయినప్పటికీ ఇరు ప్రభుత్వాలు చొరవతీసుకుని రైతాంగానికి మేలు చేయాలని డిమాండ్ చేశారు. వంటలు నష్టపోయిన రైతులు తీవ్ర మనోవేదనతో ఉన్నారని, ప్రభుత్వాలు రైతులకు భరోసా కల్పించాలన్నారు. ఇళ్లుకోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ఇల్లు కట్టించాలని, పశువులు కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాధం, సిపిఐ రాష్ట్ర నమితి సభ్యులు, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట నియోజకవర్గ కార్యదర్శి సలీం, మండల పార్టీ కార్యదర్శి రామకృష్ణ, సీనియర్ నాయకులు చెన్నయ్య, సైదా,రాజు, శ్రీను, వెంకటేశ్వరరావు, జాకీర్, జోనఫ్ రాజు, విజయ్, రాము తదితరులు పాల్గొన్నారు. (Story : అధికారుల నిర్లక్ష్యం వల్లే పెద్ద వాగు ప్రాజెక్టుకు గండి)