Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జ‌గ‌న్‌పై దుమ్మెత్తిపోసిన అనిత‌..!

జ‌గ‌న్‌పై దుమ్మెత్తిపోసిన అనిత‌..!

0

జ‌గ‌న్‌పై దుమ్మెత్తిపోసిన అనిత‌..!

• తన కార్యకర్త అంటూ భుజాలు ఎగరేసుకుంటూ వెళ్లిన జగన్ బాధిత కుటుంబానికి ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు
• జరిగిన రాజకీయ హత్యలు నాలుగు మాత్రమే… అందులో చనిపోయింది ముగ్గురు టీడీపీ కార్యర్తలే
• 36 రాజకీయ హత్యలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు?
• వైసీపీ పాలనలో నిజంగా జరిగిన దానిపై చిన్న పోస్ట్ పెడితే సీఐడీతో అరెస్ట్ చేయించారు
• నేడు జనగ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు ?
•  తగుదునంటూ… ఢిల్లీలో ధర్నా చేస్తానంటున్నారు. రాష్ట్ర పతి పాలన కోరుతున్నారు
• వైసీపీ నేతల అబద్దాలను ప్రజలే తిప్పి కొడతారు

న్యూస్‌తెలుగు/అమ‌రావ‌తి : ప్రజలు ఛీ కొట్టి ఛీత్కరించినా వైసీపీ నేతలు మారడంలేదని… వారి అబద్ధాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని… హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. అధికారం పోవడంతో జగన్ రెడ్డికి బుర్ర దొబ్బి ఎక్కడికెళ్లి ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. అసత్యాలు, అబద్ధాలతో కూటిమి ప్రభుత్వంపై బురద చల్లి.. మళ్లీ సీఎం కావాలనే కలలు కంటున్నాడని.. ఆ అబద్ధాలను ప్రజలు నమ్మరని తెలిపారు. జరిగినవి వాస్తవంగా రాజకీయ హత్యలు అయితే ఆ హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదన్నారు. నేడు ఆమె మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో విలేఖరులు సమావేశంలో మాట్లాడారు.

హోంమంత్రి అనిత మాట్లాడుతూ..

ప్రజల చేత ఛీత్కరింపబడిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి.. నేడు ప్రజల్లో విషపు బీజాలు నాటడానికి యత్నిస్తున్నాడు. ప్రజల్లో భయాన్ని సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నాడు. వైసీపీ పాలనలో పోలీసులను చెప్పు చేతల్లో పెట్టుకుని రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపాడు. జగన్ రెడ్డి ఉంటే ఇక బ్రతకలేమనే అభిప్రాయంలోకి నాడు ప్రజలు వచ్చారు. జగన్ రెడ్డి అరాచకాన్ని తట్టుకోలేకనే వైసీపీకి 11 సీట్లు ఇచ్చి పాతిపెట్టారు. అబద్దాలు మాట్లాడటం జగన్ రెడ్డికి సిగ్గు అనిపించడం లేదో కాని వింటున్న జనాలు సిగ్గుపడుతున్నారు. ఎందుకు ఓడిపోయారో తెలుసుకోకుండా.. శవరాజకీయాలు చేస్తున్నారు.

36 రాజకీయ హత్యలు, 300 లకు పైగా హత్యాయత్నాలు, 30 ఆత్మహత్యలు, 560 కు పైగా ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారని 1000 వరకు దాడులు, దౌర్జన్యాలు చేశారని పరామర్శకు వెళ్లి పచ్చి అబద్దాలు, అసత్యాలు చెబుతున్నారు. వాటికి సంబంధించిన వివరాలు వెంటనే ఇవ్వాలి. వివరాలు ఇవ్వకుంటే తప్పుడు ఆరోపణలపై చర్యలు తీసుకుంటాం. నిజంగా రాజకీయ హత్యలు జరిగింది నాలుగు మాత్రమే. జరిగిన హత్యల్లో కూడా ముగ్గురు టీడీపీ నాయకులే చనిపోయారు. క్రైమ్ నెంబర్ 137/24 ప్రకారం జూన్ 4న దుగ్గిరాల పోలీస్టేషన్ పరిధిలో హత్య జరిగింది. చనిపోయిన వ్యక్తి కాశీం టీడీపీ నాయకుడు… చంపిన వ్యక్తి కమల్ వైసీపీకి చెందిన వ్యక్తి. క్రైమ్ నెంబర్ 92/24 ప్రకారం వెల్దుర్తిలో జూన్ 9 టీడీపీ నేత ఎమ్. గిరినాథ్ చౌదరిని వైసీపీ నేతలు సుదేపల్లి రమేష్ తదితరులు చంపారు. పుట్లూరు మాత్రమో వైసీపీ నేత ఎరకయ్య చనిపోయాడు. క్రైమ్ నెంబర్ 148/24 రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్ల ఆదికేసువులను వైసీపీ నేతలు కేశవరెడ్డి తదితరులు హతమార్చారు.

జగన్ చెప్పిన అబద్దపు లెక్కలు నిజం కాదు. వైసీపీ ప్రభుత్వంలో నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ను రంగనాయకమ్మ చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే సీఐడితో విచారణ జరిపించి ఇబ్బంది పెట్టారు. గౌతు శిరీష ఒక చిన్న పోస్టు వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టారని ఆమెను సీఐడీ ఆఫీసులో కూర్చోబెట్టారు. చింతకాలయ విజయన్ ను ఇబ్బంది పెట్టారు. జనసేన నాయకులను ఇబ్బంది పెట్టారు. నిజాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా… తప్పుడు కేసులు పెట్టారు. నేటికీ వాళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నేడు జగన్ రెడ్డి ఇష్టానుసారం తప్పడు ప్రచారం చేస్తున్నాడు.

జగన్ రెడ్డి మాటలు జనాలు ఎలా నమ్ముతారు అనుకుంటున్నాడో.. కాని వ్యక్తిగత హత్యపై ఒక ప్రైమ్ మినిస్టర్ కు లెటర్ రాసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నాడంటే.. ఆయన ఎంత ఘనుడో అర్థం చేసుకోవాలి. 2019 లో జగన్ రెడ్డి అధికారం చేపట్టాక.. రాజ్యంగా హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఏపీ హైకోర్టే చెప్పింది. అధికారం కోల్పోయిన నెలరోజుల్లోనే మళ్లీ అధికారం కోసం ఎంత తహతహలాడుతుడో ఈ పులివెందుల ఎమ్మెల్యే. అధికారం పోయేసరికి జగన్ రెడ్డికి మైండ్ దొబ్బంది. బాధితులకు వద్దకు వెళ్లి ఏమి మాట్లడాలో కూడా తెలియక అమ్మఒడి వచ్చిందా. వసతి దీవెన అందిందా.. చంద్రబాబు అన్ని ఇచ్చారా? అంటూ మాట్లాడుతున్నాడు. పరామర్శకు వెళ్లిన వ్యక్తి బాధితులను ఆదుకోకుండా… శవరాజకీయం కోసం పదిసార్లు నొక్కి నొక్కి ఎమ్మెల్యే భార్యకు కేకు తినిపించిన ఫోటో చూపిస్తూ.. ఫోటోలో ఉన్నవారిని కూడా అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్నాడు. అలా రెస్ట్ చేయాలంటే జగన్ రెడ్డితో కూడా వారు ఫోటో దిగారు. జగన్ నే ముందు అరెస్ట్ చేయాలి.

నింధితులను అరెస్ట్ చేసి జైలుకు పంపితే.. జగన్ రెడ్డి వినుకొండ వెళ్లి మళ్లీ రెచ్చగొడుతున్నాడు. గవర్నర్ దగ్గరకు వెళ్లతామని చెబుతున్నాడు. వైసీపీ నేతలు కూల్చేసిన భవనాలు, డిజీపీ పక్కనే మా పార్టీ ఆఫీసపై చేసిన దాడి. చంద్రబాబు చలో ఆత్మకూరు పెడితే చంద్రబాబు ఇంటికి పెద్ద తాళ్లు కట్టి బందించిన తీరు. జోగి రమేష్ తో చంద్రబాబు ఇంటిపై దాడి చేయించింది. జై జగన్ అననందుకు తోట చంద్రను పీక కోసింది. ఇలాంటి ఘటనలపై మేము ఎవరిదగ్గరకు వెళ్లి ఉండాలి. నేను మహిళా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు మహిళాకమిషన్ చైర్ పర్సన్ కు ఈ ఘటనలపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశా. ఛానల్ , పేపర్ ఉందని నోటికి వచ్చినట్లు ఫేక్ గా మాట్లాడితే ఉరుకోం?

అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఉందని దాన్ని జగన్ రెడ్డి కూని చేశాడు. సీసీ కెమెరాలు, ఫింగర్ అతెంటికేషన్ ఏది లేదు. జగన్ కు కాపలకాయడానికి మాత్రమే పోలీసులను ఉపయోగించుకున్నాడు. టీడీపీ నాయకులు బయటకు రాకుండా వాడుకున్నాడు. నేడు చంద్రబాబు ఒక్క నెలలో ఎన్నిసార్లు ప్రజల్లోకి వచ్చాడు. నాడు జగన్ రెడ్డి దాన్ని ఎందుకు చేయలేకపోయాడు. నేషనల్ క్రైమ్ రిపోర్టు ప్రకారం జగన్ రెడ్డి పాలనలో డబుల్ క్రైమ్ జరిగింది. రాజమండ్రి లో జగన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన రోజే ఒక అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేసి ఆటోలో వదిలేస్తే.. నేటికి ఆ నింధితులను పట్టుకోలేదు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే కాబోయే భర్తముందే అమ్మాయిపై అత్యాచారం చేస్తే ఇప్పటికి పట్టుకోలేదు.

జగన్ రెడ్డి గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆడబిడ్డలపై జరిగిన అత్యాచారాలమీద మాట్లాడలేదు. నేడు చంద్రబాబు పాలనలో వెంటనే నింధితులను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాం. నా కంటే ముందే చంద్రబాబు గారు స్పందించి చర్యలకు ఆదేశిస్తున్నారు. అది అడ్మినిస్ట్రేషన్ అంటే. ఏ రోజైనా ఒక్క రివ్వూ కూడా చేయని జగన్ లాఆండర్ ఆర్డర్ గురించి మాట్లాడుతుటే సిగ్గు అనిపించడంలేదా? చంద్రబాబు మీద ఒక్క మాట మాట్లాడుతున్నారంటే ప్రజలందరి మీద మాట్లాడినట్లే. నిజం అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. వర్గ విభేదాల మధ్య జరిగిన హత్యను రాజకీయం కోసం వాడుకోవడానికి జగన్ రెడ్డి వచ్చాడు. జగన్ రెడ్డి ఆటవిక పాలన సాగుతోంది అంటూ మాట్లాడుతుంటే నిజంగా నవ్వు వస్తోంది. సీఎం కుర్చికోసం సొంత బాబాయిని చంపిన వ్యక్తి, కోడికత్తి కేసులో ఒక దళితున్ని ఇరికించిన వ్యక్తి, మళ్లీ గులకరాయి డ్రామాతో సీఎం కావాలనుకున్న వ్యక్తి ఆటవిక పాలన గురించి మాట్లాడటం సిగ్గుచేటు.

సొంత చెల్లి న్యాయం చేయమని అడిగితే ఐదేళ్లలో ఒక్క అడుగుకు కూడా ముందుకు వెయలేదు. మళ్లీ అవినాష్ రెడ్డి మంచోడు అంటూ వెనకేసుకు వచ్చాడు. సిగ్గులేకుండా ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తాడంట. రా నేను వస్తా నువ్వు ఏమి చేశావో చెప్పు. మేము ఏం చేశామో చెబుతాం. ఢిల్లీలో కూర్చుని వివేకాదరెడ్డి హత్య గురించి చెబుతారా? టీడీపీ నేతలపై చేసిన దాడుల గురించి చెబుతారా? మాజీ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపై చేసిన దాడి గురించి మాట్లాడుతారా? చంద్రబాబు అమరావతి వెళ్లినప్పుడు రాళ్లువిసిరి భావస్వేచ్ఛ ప్రకటన అన్నది చెబుతారా? ఏది ఆటవిక పరిపాలన మేము ఏనాడైనా రాళ్లు విసిరామా జగన్ రెడ్డి. నువ్వు రోడ్డు మీదకు వచ్చినప్పుడు నిన్ను ఎవరైనా అడ్డుకున్నారా?. పిన్నెల్లి పరామర్శకు వచ్చావు కదా ఎవరు అడ్డుకోలేదే? ఎన్నో ఘాతుకాలు చేసి మళ్లీ సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతారా?

ఈ సాక్షి పాంప్లేట్ పేపర్ లో జగన్ రెడ్డికి ఇచ్చిన వెహికిల్ గురించి తప్పుడు రాతలు రాశారు. అసలు జగన్ రెడ్డి అనే వ్యక్తి నేడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. మాజీ సీఎం అని గౌరవించి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు. టాటా సఫారి ఇచ్చారు. అయినా తెగ బాధపడుతున్నారు. 2019 లో సీఎంగా నువ్వు ఎక్కినప్పుడు నాడు చంద్రబాబు కు ఇచ్చింది కూడా టాటాసఫారే.. నేటికి కూడా సీఎం టాటాసఫారీనే వాడుతున్నారు. గవర్నమెంట్ మీద బురద చల్లాలనే కుట్రతో ఇది మీరు చేసిన డ్రామా. జగన్ రెడ్డి వేరే కారు ఎక్కినా ఆయన వెంటనే ప్రోటోకాల్ కారు వెళ్లింది. ఎక్కడా ప్రోటో కాల్ అతిక్రమించలేదు. ఎక్కడా సెక్యూరిటీ తగ్గించలేదు. జగన్ రెడ్డి ఇంటిపైకి ఎవరూ దాడికి రాలేదు. ఎక్కడికైనా వెళ్తానంటే పోలీసులు చేత తాళ్లు కట్టించలేదు. అయినా ఆటవిక పాలన అంటున్న మీరు ఏది ఆటవిక పరిపాలనో చర్చకు సిద్దామ జగన్ రెడ్డి. మీ నాయకుల చేతనే మళ్లీ గులకరాళ్లు విసిరించుకుని మాపై రుద్దడానికే బులెట్ ఫ్రూప్ కారు దిగి మీ కారులో వెళ్లి మళ్లీ నాటకాలు ఆడుతున్నారు.

22 నుండి అసెంబ్లీ ఉండటంతో… అసెంబ్లీకి వస్తే జగన్ బండారం బయట పడుతుందని. ఢిల్లీలో ధర్నా అంటూ నాటకాలు ఆడుతున్నాడు. ఈ పది రోజుల్లో చంద్రబాబు రిలీజ్ చేసిన వైట్ పేపర్లలో ఆయన చేసిన దోపిడీలు దౌర్జన్యాలు బయటకు వస్తాయి.. వాటిపై చర్చ జరుగుతుందన్న భయంతోనే ప్లాన్ ప్రకారమే వ్యక్తిగత హత్యను శవరాజకీయంగా మార్చాడు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలోనే అటవికరాజకీయంపై చర్చించాలి. గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే జగన్ రెడ్డే కాదు ఎవరిపైనైనా కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం. నాడు రఘురామను ఎందుకు కొట్టి వేధించారు. అసలు రాజద్రోహం కేసే లేదు. ఆ కేసే ఉంటే.. ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది జగన్ రెడ్డినే. సొంత జిల్లాలో నాగమ్మపై హత్య జరిగినా కనీసం ఆమె ఇంటికి కూడా వెళ్లలేదు. గత ఐదేళ్లలో ఒక్క బాధిత ఇంటికి వెళ్లని జగన్ రెడ్డి నేడు మాట్లాడటం సిగ్గుచేటు.

వినుకొండ ఘటనలో వాళ్ల మాజీ ఎమ్మెలేనే చెప్పాడు… అతను గంజాయి మత్తలో చంపాడని. ప్రతి ఘనట వెనుక గంజాయి ఉంది. గత వైసీపీ పాలనలో గంజాయిని రాష్ట్ర పంటగా పండించారు. మళ్లీ సిగ్గులేకుండా విషపు బీజాలు నటుతున్నారని మాట్లాడుతున్నారు. ఐదేళ్లక్రితమే జగన్ రెడ్డి విషపు బీజాలు నాటాడు. దాని తాలుక అవశేషాలు నేడు బయట పడుతున్నయి. వాటిని మేము ప్రక్షాళన చేస్తున్నాం. డిపార్ట్ మెంట్ లలో కూడా మార్పు మొదలైంది. ఎస్పీలను పేరు పెట్టి జగన్ రెడ్డి విమర్శలు చేయడం సిగ్గుచేటు. నాడు రాజారెడ్డి రాజ్యంగం అమలు చేసి నేడు అంబేద్కర్ రాజ్యాంగం చంద్రబాబు అమలు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు.

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన జగన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటాం. జగన్ రెడ్డి రక్తచరిత్ర అంతా బయటకు తీస్తే గ్రాంథాలు అవుతాయి. నేడు హత్యలు, అత్యాచారాలు జరిగిన చోట నింధితులను వెంటనే అరెస్ట్ చేశాం. చిన్నపిల్లల మీద జరుగుతున్న అగాయిత్యాలపై ప్రత్యేక కోర్టులు తీసుకు వస్తాం. కేవలం బీసీలపై వైసీపీ పాలనలో 300 మందిని హతమార్చారు.తన అక్కను ఏడిపించవద్దన్న పాపానికి ఒక బాలున్ని కిరోసిన్ పోసి చంపారు. పేరేచర్లలో ఒక మైనర్ బాలికను వైసీపీ నాయకుడు వ్యభిచార కూపంలోకి పంపించాడు ఆరు నెలల తరువాత ఆ పాప బయటకు వచ్చి విలపిస్తే నేటికి చర్యలు లేవు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ప్రతి క్రైమ్ నింధితుడితో జగన్ రెడ్డి ఫోటో దిగాడు. అలా అయితే జగన్ రెడ్డినే ముందు అరెస్ట్ చేయాలి.

చిన్నపిల్లలపై అఘాయిత్యాలు గంజాయి, మద్యం మత్తులోనే ఎక్కువగా జరుగుతున్నాయి. పక్కింటివారు, స్థానికులు, బందువులు, తెలిసిన వారే చిన్నారులపై అత్యాచారాలు చేస్తున్నారు. దాన్ని ఏవిధంగా అరికట్టాలి. వాటిని అరికట్టడానికి ఏవిధంగా అవగాహన కల్పించాలని అనేదానికి ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నాం. ఆ స్పెషల్ డ్రైవ్ లో ఎస్పీలో పాటు నేడు కూడా వెళ్లి బడిపిల్లలో తో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అత్యాచారాలపై టాక్స్ ఫోర్ ఏర్పాటు చేసి జరుగుతున్న ఘటనలను పూర్తిగా అరికడతాం.. దీనికి నాలుగైదు రోజుల్లో టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ఐదేళ్లు పోలీసులు టీడీపీ నేతలను అరెస్ట్ చేశామా, బారీకేడ్ లు కట్టామా, 990 మంది జగన్ రెడ్డికి కాపలా కాశామా అన్నట్లు ఉన్నారు. ఇప్పుడిప్పుడే సర్థుకుంటున్నారు… త్వరలోనే అరాచకాలను పోలీసులు అరికడతారు. గత వైసీపీ పాలనలో సీసీ కెమెరాలకు, పోలీసు వెల్ఫేర్కు , ఫోరెన్సిక్ ల్యాబ్ కు వైసీపీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. నేడు పోలీసులు గౌరవంగా ఉన్నారు. చంద్రబాబు నిధులు విడుదలు చేస్తున్నారు. జగన్ రెడ్డి ఢీల్లికీ వెల్లినా ఆయన చరిత్ర అందరికి తెలుసిందే. ప్రజలే వారిని తిప్పికొడతారు. (Story : జ‌గ‌న్‌పై దుమ్మెత్తిపోసిన అనిత‌..!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version