గంజాయి తాగుతూ పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు
న్యూస్‌తెలుగు/ములుగు జిల్లా :గంజాయి తాగుతున్న ముగ్గురు వ్యక్తులను పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ అదుపులోకి తీసుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామ శివారులోని పొలాలలో 8 మంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడడంతో అటుగా వచ్చిన పేరూరు పోలీసు సిబ్బందిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని వెంబడించి అందులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని తనిఖీ చేయగా వారి వద్ద168 గ్రాముల గంజాయి లభ్యమైంది. వారిని విచారించగా తామంతా గంజాయి తాగుతామని గంజాయి తాగడం ద్వారానే స్నేహితులమయ్యామని పోలీసులకు తెలిపారు. అనంతరం వెంకటాపురం సిఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (Story : గంజాయి తాగుతూ పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు)