Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును నిధులు కేటాయించాలి

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును నిధులు కేటాయించాలి

0

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును నిధులు కేటాయించాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య 

న్యూస్‌తెలుగు/ శ్రీకాకుళం జిల్లా:పాలకుల నిర్లక్ష్యానికి ఉత్తరాంధ్ర వెనుకబాటు తనమే ఒక నిదర్శనమని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో రైతు సంఘ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో వంశధార, మహేంద్ర తనయ, బహుదా వంటి ప్రధాన నదులు ఉన్నప్పటికీ రైతాంగానికి సాగు నీరు అందించడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఆప్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని అన్నారు. రైతులకు అన్ని రకాల వ్యవసాయ రుణాలు ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలపై 90 శాతం సబ్సిడీని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.గత నాలుగు దశాబ్ధాలుగా ఉత్తరాంధ్రా ప్రోజెక్టులు వెక్కిస్తున్నాయని, ఆఫ్సోర్ ప్రోజెక్టు నిర్వాసితుల సమస్యలు ఈ రోజుకి తీర్చలేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యం కనబడుతుంది అని అన్నారు..కేంద్రంలో బుల్డోజర్ సర్కారు రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు ట్రబుల్ ఇంజన్ సర్కారులా మారకముందే ప్రోజెక్టులు పూర్తిచేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.ఈ జిల్లాలో జీడి పంటకు గిట్టుబాటు దక్కడం లేదని ఈ ప్రాంత జీడి రైతులు గత 40 సంవత్సారులుగా వ్యాపారుల ధగాకు గురి అవుతున్నారని ఇప్పటికైనా జీడి పంటకు రూ 16000 గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని. గిరిజన రైతాంగం జీడి పంటకు పెట్టుబడి లేక సరైన రీతిలో పంట పండించుకోలేకపోతపన్నారని, వారికి వడ్డిలేని పంట రుణాలు కల్పించాలని డిమాండ్ చేసారు. నిరుపేదలు ఉపాధి కోసం భూ యజమానుల దగ్గర నుండి కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నారు. మరి కొంతమంది ఎటువంటి సొంత భూమితో పాటు మరికొంత భూమిని కౌలకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. భూ యజమానుల భూమితో పాటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ సంబంధించిన భూములు సాగు చేసేవారు కూడా ఉన్నారు. మొత్తం వ్యవసాయ రంగంలో కవులు రైతులే కిలకమైన భూమిక పోషిస్తున్నారని ఆయన అన్నారు. కానీ కౌలు రైతులకు పాలక ప్రభుత్వాలు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.కౌలు రైతులు సాగు చేస్తున్న దామాషాను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి సున్నా వడ్డీకే పంట రుణాలు అందించాలని,
ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని పెంచి ఎకరానికి రూపాయలు 15000 చొప్పున భూములేని కౌలు రైతులకు పంట సాయం అందించాలని,దేవాదాయ, ధర్మాదాయ శాఖ సాగు భూముల వేలం పాటలు రద్దుచేసి గతేడాది సాగు చేసి వర్షా బావ తుఫానుల వల్ల నష్టపోయిన కవులు రైతులకు కౌలు రేట్లు తగ్గించి నామినల్ లీజుకు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా ఈ నెల 27,28,29 తేదీల్లో మదనపల్లి లో జరిగే రైతు సంఘ సమావేశాలకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. అనంతరం జిల్లా రైతు సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఆ సంఘ కన్వీనర్ గా చాపర వేణుగోపాల్, కోకన్వీనర్ గా అయినింటి. లోకనాదం సభ్యులుగా పి ఎర్రం నాయుడు, హనుమంతు శంకరరావు, సొర్ర లక్ష్మణరావు,మెట్ట సింహాచలం,కొన్న రమణాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. (Story : ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును నిధులు కేటాయించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version