షాలిని మట్టాతో భేటీ అవ్వండి
న్యూస్‌తెలుగు/ముంబయి: అందరూ ఎంతగానో ఆసక్తిగా వేచి చూస్తున్న ప్రైమ్ డేను అమెజాన్ ఇండియా జులై 20, 21, 2024న తీసుకువస్తోంది. గొప్ప డీల్స్, కొత్త విడుదలలు, బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్‌లను కేవల తన వినియోగదారులకు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా వినియోగదారులను సంతోషాలను అందించేందుకు కట్టుబడిన అమెజాన్ ఉద్యోగులకు కూడా అపారమైన ఆనందాన్ని అందిస్తుంది. అమెజాన్‌లో బ్యూటీ అండ్ లగ్జరీ కేటగిరీల సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ షాలిని మట్టాను భేటీ అవ్వండిక. ఆమె ఇంజినీరింగ్ నుంచి కంటెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్‌కి చేస్తోన్న ప్రయాణం ఆమె అభిరుచికి, అనుకూలతకు నిదర్శనం. ప్రశాంతమైన రైల్వే పట్టణం జంషెడ్‌పూర్‌లో జన్మించి, విశాఖపట్నంలో పెరిగిన షాలిని ఐఐటి ఢల్లీిలో ఇంజనీరింగ్ డిగ్రీని, ఐఐఎం కోల్‌కత్తాలో ఎంబీఏ పూర్తి చేసుకున్నారు. ఇవి ఆమె విద్యాభ్యాసానికి గట్టి పునాదులుగా ఉన్నాయి. అయితే, ఆమె మార్గం సంప్రదాయానికి భిన్నంగా మారింది. ఇంజనీరింగ్, వ్యాపారంలో ఉన్న బలమైన నేపథ్యంతో, ఆమె కంటెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్‌కు సంబంధించిన డైనమిక్ రంగాలలోకి ప్రవేశించింది. (Story : షాలిని మట్టాతో భేటీ అవ్వండి)