Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సూపర్ స్టార్ కృష్ణ 82 వ జయంతి వేడుకలు

సూపర్ స్టార్ కృష్ణ 82 వ జయంతి వేడుకలు

0

సూపర్ స్టార్ కృష్ణ 82 వ జయంతి వేడుకలు

న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక అరుణ థియేటర్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ 82 వ జయంతి సందర్భంగా కృష్ణ మరియు మహేష్ బాబు ఫాన్స్ వినుకొండ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట కృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. అభిమాని స్టీఫెన్ కి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి కృష్ణకి నిజమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మానవ సేవా సమితి అధ్యక్షులు మరియు కృష్ణ అభిమాన సంఘం నాయకులు పివి సురేష్ బాబు మాట్లాడుతూ. వినుకొండ పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థానిక శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ వీఫ్ జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు, చైర్మన్ దస్తగిరి మరియు కౌన్సిలర్లు సహాయ సహకారంతో విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఫాన్స్ అసోసియేషన్ వినుకొండ వారు తీర్మానం చేశారు. కృష్ణ అభిమానులకు అండగా ఉంటామని ప్రజాహిత కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తామని మహేష్ బాబుకి అండగా ఉంటామని ఆపద సమయాలలో అండగా నిలుస్తామని ఈ సందర్భంగా పీవీ సురేష్ బాబు రవి చికెన్ బాబు వీరాంజనేయులు శివరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం అండ్ ఎం రవి బాండ్, చికెన్ బాబు, పూర్ణ, చిట్టిబాబు, రత్నం, కృష్ణ, కిషోర్, లక్ష్మీనారాయణ, వీరాంజి, శివరామయ్య, రంగారెడ్డి, వందనం, వెంకటరావు, మౌలాలి, టి వెంకటేశ్వర్లు, చిన్న, రహీం తుల్లా తదితరులు పాల్గొన్నారు. (Story:సూపర్ స్టార్ కృష్ణ 82 వ జయంతి వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version