Home వార్తలు ‘కిడ్స్‌ గో ఫ్రీ’ ఆఫర్‌ తీసుకువచ్చిన డిఎస్‌ఎస్‌

‘కిడ్స్‌ గో ఫ్రీ’ ఆఫర్‌ తీసుకువచ్చిన డిఎస్‌ఎస్‌

0

‘కిడ్స్‌ గో ఫ్రీ’ ఆఫర్‌ తీసుకువచ్చిన డిఎస్‌ఎస్‌

న్యూస్‌తెలుగు/దుబాయ్‌: దుబాయ్‌ సమ్మర్‌ సర్‌ప్రైజెస్‌ (డిఎస్‌ఎస్‌) అద్భుతమైన ‘ కిడ్స్‌ గో ఫ్రీ’ ఆఫర్‌ను మరోమారు తిరిగి తీసుకొచ్చింది. దీని ద్వారా కుటుంబాలు ఇప్పుడు దుబాయ్‌ ప్రపంచ స్థాయి రిసార్ట్‌లు, ఆకర్షణలు, వినోద గమ్యస్థానాలలో అత్యంత అందుబాటు ధరల్లో వసతి,వినోదం ఆస్వాదించవచ్చు. డిఎస్‌ఎస్‌లో భాగంగా దుబాయ్‌ ఫెస్టివల్స్‌, రిటైల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ద్వారా నిర్వహించబడిన కిడ్స్‌ గో ఫ్రీ, గొప్ప ధరలతో నగరంలోని ఉత్తమమైన వాటిని వీక్షించటానికి కుటుంబాలకు సహాయపడుతుంది. నగరంలోని వందలాది హోటళ్లు – విశాలమైన బీచ్‌సైడ్‌ రిసార్ట్‌ల నుండి కూల్‌ సిటీ రిట్రీట్‌ల వరకు – ఇద్దరు పిల్లల వరకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా పెద్దల గదిలో ఉండడానికి అనుమతిస్తున్నారు. వారి తల్లిదండ్రుల మాదిరిగానే భోజన పథకాలను కూడా ఆస్వాదించే అవకాశం అందిస్తున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు అట్లాంటిస్‌ ది పామ్‌, సెయింట్‌ రెగిస్‌ దుబాయ్‌, ది పామ్‌, లే మెరిడియన్‌ దుబాయ్‌, అడ్రస్‌ స్కై వ్యూ, అడ్రస్‌ ఫౌంటెన్‌ వ్యూ, విడా క్రీక్‌ హార్బర్‌, విడా ఎమిరేట్స్‌ హిల్స్‌, ప్యాలెస్‌ డౌన్‌టౌన్‌ మరియు గోల్డెన్‌ సాండ్స్‌లో చిరస్మరణీయమైన స్టే-కేస్‌తో వేసవిలో ఎక్కువ సమయం గడపవచ్చు. (Story : ‘కిడ్స్‌ గో ఫ్రీ’ ఆఫర్‌ తీసుకువచ్చిన డిఎస్‌ఎస్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version