Home వార్తలు హ్యుందాయ్‌ సరికొత్త ఎస్‌యూవీ ఎక్సీటర్‌ హై`సీఎన్‌జీ డుయో విడుదల

హ్యుందాయ్‌ సరికొత్త ఎస్‌యూవీ ఎక్సీటర్‌ హై`సీఎన్‌జీ డుయో విడుదల

0

హ్యుందాయ్‌ సరికొత్త ఎస్‌యూవీ ఎక్సీటర్‌ హై`సీఎన్‌జీ డుయో విడుదల

న్యూస్‌తెలుగు/గురుగ్రామ్‌: థింక్‌ ఎస్‌యూవీ, థింక్‌ ఎక్సీటర్‌ అనే నినాదంతో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) తాజాగా సరికొత్త ఎస్‌యూవీ ఎక్సీటర్‌ హై`సీఎన్‌జీ డుయోను విడుదల చేసింది. దీని ప్రారంభధర రూ.8,50,300. రెండు సీఎన్‌జీ సిలిండర్లు ఉండటం దీని ప్రత్యేకత. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఎస్‌ఎస్‌ఎక్స్‌, ఎక్సీటర్‌ నైట్‌ ఎస్‌ఎక్స్‌ బై ఫ్యూయిల్‌ (పెట్రోల్‌, సీఎన్‌జీ) ప్రధానమైనవి. ఈ రెండో వేరియంట్‌కు 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమైన ఇంజిన్‌ ఏర్పాటు చేయబడిరది. యాంపిల్‌ బూట్‌ స్పేస్‌ ఉండటం వల్ల కస్టమర్లకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ఇంటిగ్రేటెడ్‌ ఎలక్ట్రానికÊ కంట్రోల్‌ యూనిట్‌ (ఈసీయూ) ఉండటంతో తిరుగులేని డ్రైవింగ్‌ అనుభవాన్ని పొందవచ్చు. పెట్రోల్‌ నుంచి సీఎన్‌జీకి, సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌కు సులువుగా మారవచ్చు. కంపెనీ అమర్చిన సీఎన్‌జీ వ్యవస్థకు మూడు సంవత్సరాల వారంటీ కూడా ఉంటుంది. దీంతో గరిష్ఠ భద్రతపై హామీ ఉంటుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version