అండమాన్ దీవులలో అడుగుపెట్టిన ఇండెల్ మనీ
న్యూస్‌తెలుగు/కొచ్చి: ప్రముఖ గోల్డ్ లోన్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ), ఇండెల్ మనీ, శీఘ్ర, సౌకర్యవంతమైన ఆర్థిక సేవలను అందించే ఆరు శాఖలను ప్రారంభించడం ద్వారా అండమాన్ దీవులలోకి ప్రవేశించింది. గరచరమా, జంగ్లిఘాట్, వింబర్‌లిగంజ్, హడ్డో, అబెర్డీన్ బజార్, ప్రోతారాపూర్‌లో ఉన్న ఆరు శాఖలను చైర్మన్ మోహనన్ గోపాలకృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ఉమేష్ మోహనన్ మాట్లాడుతూ పర్యాటకం వంటి ఆర్థిక కార్యకలాపాలలో గణనీయమైన పెరుగుదలను చూసినప్పటికీ అండమాన్ దీవుల ప్రాంతం ప్రస్తుతం ఆర్థిక సేవల లభ్యత పరంగా వెనుకబడి ఉందని, ఈ వృద్ధిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి, స్థానిక జనాభాకు క్రెడిట్, ఆర్థిక సేవలకు అనుకూలమైన, శీఘ్ర సేవల లభ్యత అవసరం, వీటిని అందించడానికి సంప్రదాయ రుణదాతలు తగినంతగా సన్నద్ధం కాలేదని తెలిపారు. ఇండిల్ మనీ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ అంతరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని,అదే సమయంలో స్థానిక ఆర్థిక వ్యవస్థ మొత్తం అభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఇండెల్ మనీ ఇటీవలే అహ్మదాబాద్‌లో తన 300వ శాఖను ప్రారంభించింది. ఇది గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢల్లీి, యుపి, హర్యానా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కేరళ అంతటా విస్తరించి ఉన్న విస్తృత నెట్‌వర్క్‌లను నిర్వహిస్తోంది. (Story :అండమాన్ దీవులలో అడుగుపెట్టిన ఇండెల్ మనీ)