హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆధ్వర్యంలో పరివర్తన్ స్కిల్
న్యూస్‌తెలుగు/ ముంబయి: ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ స్కిల్ పేరుతో తన వివిధ నైపుణ్య కార్యక్రమాల ద్వారా భారతదేశమంతటా 3,25,000 మంది యువతను నిమగ్నం చేసిన కార్యక్రమంతో ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి పెంపుదల అనేది బ్యాంక్ పరివర్తన్ ప్రోగ్రామ్‌లో కీలకమైన అంశం. ఇది అన్ని సీఎస్‌ఆర్ కార్యక్రమాలకు దాని గొడుగు బ్రాండ్ ఐటీ, ఐటీస్, రిటైల్, హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, వ్యవసాయంతో సహా పలు రంగాలను కవర్ చేస్తూ వివిధ రాష్ట్రాల్లో స్కిల్ డవలప్‌మెంట్ రంగలో 100కిపైగా ప్రాజెక్టులపై బ్యాంక్ ప్రస్తుతం పనిచేస్తున్నది. 2014 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే జులై 15న గుర్తించబడిన ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం ఉవతకు ఉపాధి, మంచి పని, వ్యవస్థాపకత కోసం నైపుణ్యాలను సమకూర్చడం, అలాగే ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం, స్థిరమైన అభివృద్ధిని సాధించడం వంటి వ్యూహాత్మక ప్రాముఖ్యతలను జరుపుకుంటున్నది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ యువత శిక్షణా కార్యక్రమాలు నేటి డైనమిక్ జాబ్ మార్కెట్‌లో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం, సామర్థ్యాలతో యువతను సన్నద్ధం చేయడం ద్వారా ఈ అవసరాలను పరిష్కరిస్తాయి. ( Story : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆధ్వర్యంలో పరివర్తన్ స్కిల్)