రాబోయే బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ రంగానికి ప్రాధాన్యత ఇస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరిలో 2024-25 లో ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రివెంటివ్ కేర్, మహిళల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల విస్తరణ, పిల్లల అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు. ఇది ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు గణనీయమైన పురోగతిని సూచిస్తుందని తెలిపారు. రాబోయే బడ్జెట్ ఈ విధానాన్ని కొనసాగిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. (Story : రాబోయే బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి)