ముఖ్యమంత్రి చదివిన పాఠశాలకు మహర్దశ
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విద్యాభ్యాసం చేసిన వనపర్తి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల వనపర్తి చరిత్రలో మరో కలిగితురాయిగా నిలవడం ఉంది పాఠశాలను అధునాతన హంగులతో పూర్తి సౌకర్యాలతో నిర్మాణాలకు, అనుసంధాన వ్యాపార సముదాయాల ఏర్పాటుకు రూ 160 కోట్లు అవసరం ఉన్నట్లు గుర్తించిన వనపర్తి ఎమ్మెల్యే అందుకు కావాల్సిన ప్రతిపాదనలను రూపొందించి సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అందజేశారు వనపర్తి అభివృద్ధిపై నిరంతరాయంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యేను అభినందిస్తూ అధునాతన అంగులతో పాఠశాలను ఏర్పాటు చేసేందుకు రూపొందించిన 160 కోట్ల రూపాయల ప్రతిపాదనను ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. (Story : ముఖ్యమంత్రి చదివిన పాఠశాలకు మహర్దశ)