ప్రతిభావంతులకు చేయూతను అందిద్దాం!
న్యూస్ తెలుగు/విజయనగరం: ప్రతిభావంతులకు చేయూతనందిస్తే విద్య రంగంలో ఉన్నత ఫలితాలు అందిస్తారని పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది ఫోరెస్ రాజు పేర్కొన్నారు. విశ్వ కళా పరిషత్, వనితా వాకర్స్ క్లబ్ ఫోర్ట్ శాఖ, నా ఊరు విజయనగరం, గురజాడ బ్రాహ్మణ సమాఖ్య, తిలక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని సుమారు వంద మంది విద్యార్థులకు నోట్స్ పుస్తకాలు, జామెంట్రీ బాక్స్ లు వంటి విద్యా ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. పట్టణంలోని యూత్ హాస్టల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఫోరెస్ రాజు మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన విద్య చదవాలని ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు, పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తిని సత్కరించారు. విశ్వ కళా పరిషత్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతలపూడి త్రినాధరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముళ్ళపూడి సుభద్ర దేవి, కందాళ సాయిబాబా, టీ మహేశ్వరరావు, రామకృష్ణ కొత్తలి ఎర్రి నాయుడు, బెల్లాపు సత్యనారాయణ, ఎస్.అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు 100 మందికి నోట్స్ పుస్తకాలు, జామెంట్రీ బాక్స్లు ఉచితంగా అందజేశారు. (Story: ప్రతిభావంతులకు చేయూతను అందిద్దాం!)