ఒక్క రోజే గడువు
న్యూస్ తెలుగు/విజయనగరం: 2024 – 25 మొదటి ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీ లేకుండా ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను చెల్లించేందుకు రేపటితో అనగా 30.6.2024 తేదీ ఆదివారం వరకు మాత్రమే గడువు ఉన్నదని పత్రికా ప్రకటన ద్వారా నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు తెలియజేశారు. కావున ఆదివారం కార్యాలయమునకు సెలవు దినం అయినప్పటికీ పన్నులు చెల్లించేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు తెరిచి ఉండబడునని తెలియజేయడమైనది. ప్రజలు పై విషయాన్ని గమనించి వడ్డీ లేకుండా ఆస్తి పన్నులను ఆదివారం లోగా చెల్లించుకోవచ్చని తెలియజేయడమైనది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. (Story: ఒక్క రోజే గడువు)