Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సీతం వేదికగా ‘గణితశాస్త్ర అంతర్జాతీయ వెబినార్’

సీతం వేదికగా ‘గణితశాస్త్ర అంతర్జాతీయ వెబినార్’

0

సీతం వేదికగా ‘గణితశాస్త్ర అంతర్జాతీయ వెబినార్’

న్యూస్ తెలుగు/విజయనగరం: స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 5, 6వ తేదీలలో గణిత శాస్త్రంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వెబినార్ “నాన్ లీనియర్ అనాలసిస్ మరియు మ్యాథమెటికల్ అప్లికేషన్స్” శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభమైనదని, పూర్తిగా ఆన్లైన్ లో నిర్వహిస్తున్న ఈ వెబినార్ వివిధ రంగాలలో గణిత శాస్త్ర అనువర్తనాలను గూర్చి సవివరంగా వివరించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామమూర్తి తెలియజేశారు. ఈ వెబినార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర మ్యాథమెటికల్ సొసైటీ ప్రెసిడెంట్ ఆంధ్ర యూనివర్సిటీ గణిత ప్రొఫెసర్ కె. కె. ఎమ్.శర్మ, ఉత్తరాంధ్ర మ్యాథమెటికల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రొఫెసర్ ఎస్. మీనాక్షి సుందరం మెమోరియల్ సొసైటీ సెక్రటరీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం గణిత శాస్త్ర ప్రొఫెసర్ సి.హెచ్. శ్రీనివాసరావు, జేఎన్టీయూ గురజాడ విజయనగరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య కె.బాబులు, సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, కళాశాల జాయింట్ సెక్రెటరీ మరియు కరస్పాండెంట్ పూజిత, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.వి.రామమూర్తి పాల్గొన్నారు. ఈ వెబినార్ లో రిసోర్స్ పర్సన్ గా హాజరైన ఉత్తరాఖండకు చెందిన శ్రీదేవ్ సుమన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనిత తోమర్ ఫిక్స్డ్ పాయింట్ థియరీ ఉపయోగించి స్టాక్ మార్కెట్ అనాలసిస్ ను గూర్చి వివరించారు.
అలాగే జేఎన్టీయూ గురజాడ విజయనగరం కు చెందిన గణిత శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ ఏ.వి.పాపారావు మ్యాథమెటికల్ మోడలింగ్ ఇన్ ఎకాలజీ గూర్చి, ఏ.జి.యు నామినేటెడ్ సైంటిస్ట్ ఫర్ మిస్సిసిపి ప్రొఫెసర్ రవి సదాశివుని వివిధ రంగాలలో సాంకేతికంగా అభివృద్ధి సాధించడంలో గణిత శాస్త్ర పాత్రను గూర్చి, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ గణిత శాస్త్ర ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఫిజిక్స్డ్ పాయింట్ తిరిగి అనువర్తనాలను గూర్చి సవివరంగా వివరించారు. ఈ సెమినార్లో దేశ విదేశాల నుంచి 250 కి పైగా అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారని వెబినార్ కన్వీనర్ డాక్టర్ జి.శ్రీచందన తెలియజేశారు. వెబినార్ డైరెక్టర్ గా డాక్టర్ కె.శ్రీలత,కో-కన్వీనర్ గా వసంత విచికల వ్యవహరించారు. (Story: సీతం వేదికగా ‘గణితశాస్త్ర అంతర్జాతీయ వెబినార్’)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version