విద్యార్థులకు కిట్స్ పంపిణీ
న్యూస్‌తెలుగు/విజయనగరం: నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల కస్పాలో శుక్రవారం స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు చేతులమీదుగా స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ షూ సాక్స్ బెల్టు, యూనిఫామ్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులంతా చిన్ననాటి నుండే ఉన్నత విజయాలు సాధించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉత్తమ విజయాలు సాధించారని అన్నారు. రానున్న కాలంలో మీరంతా ఉన్నతవిజయాలు సాధించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు, మండల ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, జడ్పిటిసి కెల్ల శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ షకీల్, మండల విద్యాశాఖ అధికారులు ఆనంద్, సత్యవతి ప్రధానోపాధ్యాయుల ఆర్. శంకర్. తెలుగుదేశం పార్టీ నాయకులు ఐవిపి రాజు, పిల్ల విజయ్ కుమార్, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. (Story: విద్యార్థులకు కిట్స్ పంపిణీ)