Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విప్లవ జ్యోతి అల్లూరికి ఘనంగా నివాళి

విప్లవ జ్యోతి అల్లూరికి ఘనంగా నివాళి

0

విప్లవ జ్యోతి అల్లూరికి ఘనంగా నివాళి

న్యూస్‌తెలుగు/విజయనగరం: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకొని, జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది అల్లూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి, పుష్ఫాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ మాట్లాడుతూ – స్వాతంత్ర్యం కేవలం సాయుధ పోరాటంతోనే సిద్ధిస్తుందని విశ్వసించి, స్వాతంత్ర్య సాధన కోసం అల్లూరి సీతారామరాజు విప్లవ పందాను ఎన్నుకున్నారన్నారు.మన్యంలో బ్రిటీషు వారి దోపిడీని ఎదుర్కొని, గిరిజనులకు అండగా నిలిచి, వారిని ఎంతగానో చైతన్యపర్చారన్నారు.ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్ర పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఆయన ఢీ కొన్నారన్నారు. భారత దేశానికికి స్వాతంత్ర్యం సాధించేందుకు, బ్రిటీషు వారితో అలుపెరగని పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు చిన్న వయస్సులోనే బ్రిటీషువారి తూటాలకు నేలకొరిగాడన్నారు. అల్లూరి సీతారామ రాజు నేడు భౌతికంగా మన మధ్యలేనప్పటికీ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన చూపిన తెగువ, పట్టుదల మనందరికి ఆదర్శనీయమని, స్ఫూర్తిదాయకమని జిల్లా అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ అన్నారు. అనంతరం, అల్లూరి చిత్ర పటానికి అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ పూల మాల వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, డిసిఆర్బీ సిఐ జె. మురళి, ఆర్ఐలు ఎన్. గోపాల నాయుడు, ఆర్.రమేష్, టి.భగవాన్, ఆఫీసు పర్యవేక్షకులు ప్రభాకరరావు, వెంకటలక్ష్మి, ఆర్.ఎస్.ఐలు సూర్యనారాయణ, వరప్రసాద్, తిరుపతిరావు, గోపాలరావు, ముబారక్ ఆలీ, మహేష్, రామారావు, మంగలక్ష్మి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, విప్లవ వీరుడు అల్లూరి చిత్ర పటానికి పుష్పాలు సమర్పించిన ఘనంగా నివాళుల అర్పించారు. (Story: విప్లవ జ్యోతి అల్లూరికి ఘనంగా నివాళి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version