2019 ఫలితాలు పునరావృతం : చిన్నశ్రీను
న్యూస్ తెలుగు/విజయనగరం: రాష్ట్రంలోను, ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 ఫలితాలు పునరావృతం అవుతాయని వైసీపీ కో ఆర్డినేటర్, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున, స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరగడం సంతోషంగా ఉందన్నారు. అధికార యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేసిందని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారని కితాబు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల బెదిరింపులు, కుట్రలను లెక్కచేయకుండా పనిచేసారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి వల్లే పార్టీకి మంచి పేరు వచ్చిందన్నారు. ఆయన్ని ప్రజలు బలంగా నమ్మడం కనిపించిందిని తెలిపారు. హామీలు నెరవేర్చి ఓటు అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. మహిళలు ఆయన మీద ఉన్న నమ్మకంతో పెద్ద ఎత్తున పొల్గొని, ఓటు వేశారని తెలిపారు. ప్రజలను ప్రతిపక్ష పార్టీలు ఎంతగానో మభ్యపెట్టినా, వాటిని ప్రజలు పట్టించుకోలేదన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు కొన్ని హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాయని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఓటు వేశారని చెప్పారు. విజయనగరం జిల్లాలో అర్దరాత్రి 3 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో పోలింగ్ శాతం పెరగడం మరో శుభపరిణామమని తెలిపారు. పెరిగిన పోలింగ్ శాతంతో వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర లో మరోసారి వైసీపీ ప్రభావం కనిపిస్తుందని స్పష్టం చేశారు. (Story: 2019 ఫలితాలు పునరావృతం : చిన్నశ్రీను)