లోకం మాధవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం
విజయనగరం (న్యూస్ తెలుగు) : మహాశివరాత్రిని పురస్కరించుకొని నెల్లిమర్ల నియోజకవర్గం లోని రామ తీర్థాలలో ఉమ్మడి తెలుగుదేశం-జనసేన పార్టీల అభ్యర్థి అయిన లోకం మాధవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహా రుద్రాభిషేకం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గం నలుమూలల నుండి అలానే విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి రుద్రాభిషేకాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుమారు 5 వేలమంది భక్తులకి
అన్న ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లోకం మాధవి నియోజకవర్గంలో చేసిన పలు కార్యక్రమాల గురించి ఎల్ఈడీ స్క్రీన్ పై వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రుద్రాభిషేకం ఆవరణలో పలు పంచాయతీలు నుండి వచ్చిన కోలన్నను చూసి ప్రజలు తిలకించారు. ప్రాంగణమంతా జనసేన జెండాలతో, జనసేన నినాదాలతోజనసైనికులు మరియు లోకం మాధవి అభిమానులు సందడి చేశారు. ప్రజలు మాట్లాడుతూ లోకం మాధవి వచ్చే ఎన్నికల్లో తప్పక గెలుస్తారని, ఆ శివుడే ఆమెకు తోడుగా ఉన్నారని ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లోకం మాధవికి ధన్యవాదములు అని తెలియజేశారు. (Story: లోకం మాధవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!